2019 గణతంత్ర వేడుకలు.. ముఖ్య అతిథిగా ట్రంప్‌..

480

వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కేంద్రం ఆహ్వానించింది. ఒకవేళ ఇదే జరిగితే మోదీ విదేశాంగ విధానంపై వస్తున్న విమర్శలకు సమాధానంతోపాటు సర్కారు చేసుకుంటున్న ప్రచారానికి మరింత ఊతమిస్తుంది. దీనిపై అమెరికా అధికారిక ప్రకటన కోసం భారత్ వేచిచూస్తోంది. అయితే, గత కొద్ది వారాలుగా భారత్‌కు అనుకూలంగా ట్రంప్ సర్కారు వ్యవహరించడాన్ని బట్టి చూస్తే ఏప్రిల్‌లో పంపిన ఆహ్వానం పట్ల సానుకూలంగా ఉన్నట్టు అర్థమవుతోంది.

india invites donald trump to be chief guest at next year’s republic day parade

భారత్ ఆహ్వానంపై ఇరు దేశాల దౌత్యాధికారుల మధ్య పలుసార్లు ఇప్పటికే చర్చలు జరిగాయి. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావడానికి ట్రంప్ అంగీకరిస్తే, మోదీ హాయాంలోనే వచ్చిన రెండో అమెరికా అధ్యక్షుడవుతారు. ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత నిర్వహించిన 2015 గణతంత్ర వేడుకలకు నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిథిగా విచ్చేశారు.వ్యూహాత్మకంగా రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ట్రంప్‌ను భారత్ ఆహ్వానించింది. అమెరికాతో విభేదాలు అధిగమించలేనివి కావని, ఇటీవల పొరుగు దేశాలతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడటానికి ట్రంప్ పర్యటన దోహదపడుతుందని మోదీ సర్కారు బలంగా నమ్ముతోంది.

Image result for independenceday

శత్రు దేశాలతో స్నేహం ఉన్న అమెరికాతో సన్నిహితంగా ఉంటె భవిష్యత్ లో మంచిది అని మోడీ భావిస్తున్నాడు.అందుకే ట్రంప్ తో స్నేహంగా మెలుగుతున్నాడు.అలాగే విదేశాంగ విధానంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడమే కాదు, వచ్చే సాధారణ ఎన్నికల్లో దీని వల్ల అదనపు ప్రయోజనం ఉంటుందని ఎన్డీఏ ప్రభుత్వం అంచనా వేస్తోంది. భారత్ ఆహ్వానాన్ని ట్రంప్ అంగీకరిస్తే అంతర్జాతీయంగా 2019 గణతంత్ర ఉత్సవాలకు ప్రాధాన్యత ఏర్పడుతుంది.చూడాలి మరి ట్రంప్ వస్తాడో లేదో..వస్తే మాత్రం మోడీ ఒక రికార్డ్ ను కొట్టినట్టే. 2015లో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, 2016లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హాలెండో, 2017లో దుబాయ్ రాజు మహ్మద్ బిన్ జైద్ అల్ నహ్యాన్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ఇప్పుడు ట్రంప్ వస్తే నాల్గవ దేశ అద్యక్షుడు వచ్చినట్టు.ఇప్పటివరకు ఏ ప్రధాన మంత్రి కూడా ఇలా దేశ అద్యక్షులను రప్పించలేదు.