Breaking News దేశంలోనే మొదటి స్థానంలో వైసీపీ : చరిత్ర సృష్టించిన జగన్

94

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో 10 రోజుల్లో విడుదల కానున్నాయి. ఆరోజే ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడిపోతారు ? అనే విషయమై స్పష్టత వస్తుంది. అప్పటివరకూ ఏం చేయాలో అర్దంకాక చాలామంది తమతమ స్టైల్లో సర్వేలు చేస్తున్నారు. దేశంలో పరిస్థితి ఏంటి ? అన్నది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం వాడి వేడిగా సాగుతున్నాయి. ఎవరికి వాళ్ళు అధికారంలోకి రాబోతుంది మేమే అంటూ స్టేట్ మెంట్ లు ఇచ్చేస్తున్నారు. ఇక వైసీపీకి అన్ని స‌ర్వేలు విజ‌యం అని చెబుతున్నాయి ఓప‌క్క తాము అధికారంలోకి రాబోతున్నాం అని చెబుతున్నారు వైసీపీ నేత‌లు, ఎక్క‌డ చూసినా ఇదే ప్ర‌చారం క‌నిపిస్తోంది, ఇక కేవ‌లం మ‌రో 8 రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది ఫ‌లితాల కోసం అందుకే ఆతృత పెరిగిపొయింది.

Image result for jagan

ఇలాంటి సమయంలో ఇండియా టుడే గ్రూప్ ఇంటలిజెన్స్ యూనిట్ ఆసక్తికరమైన సర్వే నిర్వహించింది. అభ్యర్థుల ఫలితాలపై కాకుండా, విద్యా హార్హతలపై సర్వే చేసింది. విచిత్రంగా ఈ సర్వేలో కూడా YCP పార్టీ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇందుకోసం అభ్యర్థుల అఫిడవిట్ పత్రాలను విశ్లేషించింది ఇండియా టుడే సంస్థ. ఈ సర్వే ప్రకారం YCP పార్టీ నుండి లోక్ సభకు పోటీ చేసిన అభ్యర్థులలో 88 శాతం మంది డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్నారని తెలుస్తుంది.

ఈ క్రింది వీడియో చూడండి

YCP తరువాతి స్థానంలో తమిళనాడుకు చెందిన డీఎంకే 87.5 శాతంతో రెండో స్థానంలో నిలవగా.. అన్నాడీఎంకే 86.4 శాతం డిగ్రీ హోల్డర్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఒక్కసారి గమనిస్తే.. తమిళనాడులోని ముఖ్యమైన రెండు పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేలు డిగ్రీ హోల్డర్ల విషయంలో పోటాపోటీగా ఉన్నాయి.. అదే మన ఆంధ్రప్రదేశ్ లో మరో ముఖ్యమైన TDP మాత్రం ఈ విషయంలో అడ్రస్ లేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు వైసీపీ త‌ర‌పున అంద‌రూ గ్రాడ్యువేట్స్ ఉన్నారుఅ ని ఇటీవ‌ల ఏపీలో కొన్ని మీడియా సంస్ధ‌లు కూడా వార్త‌లు ప్ర‌చురించాయి మొత్తానికి ఇప్పుడు ఈ స‌ర్వే కూడా ఇదే చెప్ప‌డంతో వైసీపీ టాప్ ర్యాంక్ లో నిల‌బ‌డింది, .జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీల్లో ఎక్క‌డా త‌గ్గ‌కుండా ముందుకు వెళుతోంది వైసీపీ.