2019లో టీడీపీకి ఈ సెగ్మెంట్లో తిరుగేలేదు

389

తెలుగుదేశం కంచుకోట ప్రాంతాల్లో వ‌చ్చే ఎన్నికల్లో గెలుపు త‌థ్యం అనేది ప్ర‌స్తుతం పార్టీ -ప్ర‌జలు చ‌ర్చించుకుంటున్న అంశం… హామీలు ఎలా ఉన్నా కేంద్రంతో పోరాటం చేస్తున్న తెలుగుదేశం పై ఇప్పుడు ప్ర‌జల్లో కూడా కాస్త సాఫ్ట్ కార్న్ పెరిగింది అనే చెప్పాలి.. ఇప్పుడు విశాఖ‌లో కూడా తెలుగుదేశం గ‌త వైభ‌వాన్ని 2019 ఎన్నిక‌ల్లో కూడా తిరిగిపొందేలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.. ముఖ్యంగా అయ్య‌న్న గంటాలాంటి సీనియ‌ర్ నేత‌ల‌కు తోడు ఇప్పుడు స‌బ్బంహ‌రి కూడా పార్టీలో చేరితే జిల్లాలో కీల‌క సెగ్మెంట్లు మెజార్టీ సీట్లు గెలుచుకోవ‌చ్చు అని ఆలోచ‌న‌లో ఉన్నారు.

ఇక యువ‌నేస్తం కూడా టీడీపీకి మంచి పేరు తీసుకువ‌చ్చేలా ఉంది.. ఇంత పీక్ టైమ్ లోకూడా బాబు స‌ర్కారు నిరుద్యోగ భృతి ఇవ్వ‌డంపై నేత‌ల ఆలోచ‌న‌తో పాటు ఓట‌ర్లు కూడా ఆలోచిస్తున్నారు…తూర్పు నగరంగా పిలవబడుతున్న విశాఖలో తూర్పు అసెంబ్లీ స్థానంలో వరుసగా రెండుసార్లు విజయంతో టీడీపీ ఈ నియోజకవర్గంపై పట్టు నిలుపుకుంటోంది. 2009, 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలిచిన వెలగపూడి రామకృష్ణ బాబు మ‌ళ్లీ విజ‌యానికి నిచ్చెన‌లు వేసుకుంటున్నారు.. వాస్త‌వానికి ఆయ‌న ఇక్క‌డ ప్రాంతం వారు కాక‌పోయినా ఇక్క‌డ ప్ర‌జ‌లు ఆయ‌న్ని ఆద‌రించారు.

Image result for tdp

మద్యం వ్యాపారంతో ఇక్కడ ఆర్ధికంగా నిలదొక్కుకున్న వెలగపూడి 2009లో తొలిసారి టీడీపీ టికెట్ పై విజయం సాధించారు. త‌ర్వాత 2014లో ఏకంగా 47 వేల మెజార్టీతో గెలిచి నియోజకవర్గంపై పట్టుందని నిరూపించుకున్నారు. ఈసారి కూడా కచ్చితంగా ఇతనికే టికెట్ దక్కుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక ప్ర‌జ‌ల్లో నిరంత‌రం ఉంటూ పేరు తెచ్చుకున్న ఆయ‌న ఆర్ధికంగా బ‌ల‌మైన వ్య‌క్తి కావ‌డంతో ఆయ‌న‌కు టికెట్ ఇచ్చేందుకు ఇక్క‌డ జిల్లా నేత‌లు కూడా స‌పోర్ట్ చేస్తున్నారు.. ప్ర‌తిప‌క్షం ఇక్క‌డ పేల‌వ‌మైన స్దితిలోనే ఉంది. మ‌రి చూడాలి ఇక్క‌డ ఎటువంటి పొలిటిక‌ల్ ఫైట్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉంటుందో.