1944లో తన ప్రియురాలితో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న కరుణానిధి కారణం తెలిస్తే

450

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మర‌ణ వార్త దేశాన్ని క‌లిచివేసింది ఓ రాజ‌కీయ యోధుడి మ‌ర‌ణం త‌మిళ ప్ర‌జ‌లని క‌న్నీరు పెట్టించింది… కావేరి ఆస్పత్రి నుంచి గోపాలపురంలోని ఆయన నివాసానికి కరుణానిధి భౌతికకాయం తీసుకువెళ్లారు.. వేలాదిగా అభిమానులు, నేతలు, పార్టీ కార్యకర్తలు క‌లిసి వ‌చ్చారు….. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గోపాలపురం నివాసానికి చేరుకొని కరుణానిధి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కనిమొళితో పాటు కరుణ కుంటుంబసభ్యులను ఓదార్చారు.

Image result for karunanidhi girlfriend

ఇంటి వద్ద కొన్ని క్రతువులు పూర్తయిన తర్వాత బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కరుణ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్‌కు తరలించారు…నేటి సాయంత్రం కరుణానిధి అంత్యక్రియలను చెన్నైలో నిర్వహించనన్నట్లు డీఎంకే నేతలు వెల్లడించారు. అయితే ఈ స‌మ‌యంలో క‌రుణ స్నేహితులు కొన్ని విష‌యాల‌ను ఆయ‌న గురించి తెలియ‌చేస్తున్నారు క‌రుణ మొండివారు అని ఆయ‌న అనుకున్న‌ది సాధించుకునే వ‌ర‌కూ నిద్ర‌పోరు అని అంటున్నారు.. అలాగే స్నేహితుల‌కు ఆయ‌న‌తో స‌మానంగా ప‌ద‌వులు ఇచ్చి పార్టీలో పైకి తీసుకువ‌చ్చారు అని చెబుతున్నారు ఇక ఆయ‌న కుటుంబంలో ఎంత పెద్ద వివాదాలు వ‌చ్చినా ఆయనే పెద్ద దిక్కుగా వ్య‌వ‌హ‌రించారుఅ ని చెబుతున్నారు ఇలా పెద్ద దిక్కుగా ఉన్న ఆయ‌న త‌న వారుసులను వారు ఎంచుకున్న రంగాల‌లో పైకి రావాల‌ని చెప్పేవారు.

Image result for karunanidhi girlfriend

కరుణానిధి సంప్రదాయాలకు పూర్తిగా వ్యతిరేకి అనే ఆరోపణలున్నాయి. వీటిలో ఎంతవరకూ నిజముందో లేదో గానీ… పెళ్లికి గుర్తుగా నిలిచే తాళిబొట్టు కట్టాలన్న కారణంగా కరుణానిధి తన ప్రేమికురాలితో పెళ్లికి నిరాకరించారట… చెన్నైకి చెందిన ప్రముఖ జర్నలిస్టు ఆర్ నూర్ అల్లా ఈ విష‌యాన్ని వెల్లడించారు.. కరుణానిధి సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవడాన్ని ఇష్టపడేవారు కాదట. ఈ కారణంగానే ఆయన తన ప్రేమికురాలిని వివాహం చేసుకోలేదని నూర్ తెలిపారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

1944లో కరుణానిధి ప్రియురాలి కుటుంబ సభ్యులు వారి పెళ్లికి అంగీకరిస్తూ సంప్రదాయబద్ధంగా వివాహం చేయాలనుకున్నారట! అయితే దీనిని కరుణానిధి నిరాకరించారట! తనకు మంగళ సూత్రమన్నా, మంత్రోచ్ఛారణలన్నా పడవని వారితో తెగేసి చెప్పేశారట! ఈ కారణంగానే వారి పెళ్లి జరగలేదని నూర్ తెలిపారు. ఈ ఘటనతో ఆవేదన చెందిన కరుణ ప్రియురాలు కూడా మరో వివాహం కూడా చేసుకోలేదట! ఆచారాలను వ్యతిరేకించే కరుణానిధి జీవితంలో ఇటువంటి ఘటనలు అనేకం ఉన్నాయని నూర్ తెలిపారు. కాగా కరుణానిధికి ముగ్గురు భార్యలు. పెద్ద భార్య ‘పద్మావతి’ కన్నుమూశారు. రెండవ భార్య దయాలూ అమ్మ, మూడవ భార్య రాజథీ అమ్మ ప్ర‌స్తుతం కుటుంబంతో క‌లిసి ఉన్నారు.