నేను ఈ విష‌యంలో టీమ్ లీడ‌ర్ -చంద్ర‌బాబు

482

సీఎంచంద్ర‌బాబు ఏపీ అభివృద్దికి కంక‌ణం క‌ట్టుకున్న న‌వ్యాంధ్ర న‌వ‌నిర్మాత, అయితే ఆయ‌న ఏ దేశ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లినా అవినీతి సొమ్ము దాచుకోవ‌డానికి అని విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటుంది. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ..ఇక ఆ వ్యాఖ్య‌ల‌ను తాను ప‌ట్టించుకోను అంటున్నారు సీఎం చంద్ర‌బాబు.. తానేంటో ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలుసు, అందుకే గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు మెజార్టీ మ‌ద్ద‌తు ఇచ్చారు అని ఆయ‌న అన్నారు.

Image result for chandra babu
తాను ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్‌ చేయడం కోసమే సింగపూర్‌ పర్యటనకు వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాను అని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో నీతివంతమైన పాలన ఉంది కాబట్టే పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ఏ రాష్ట్రంలో జ‌రుగని అభివృద్ది ఏపీలో జ‌రుగుతోంది అని అన్నారు సీఎం చంద్ర‌బాబు.

త‌మ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు చేసే వారు, గ‌డిచిన నాలుగేళ్ల క్రితం రాష్ట్రానికి ఏం పరిశ్రమలు వచ్చాయో వాళ్లు చెప్పాలన్నారు.రోడ్డు మీద తిరిగే వాళ్లు ఏవేవో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు సీఎం చంద్ర‌బాబు . వాళ్ల హయంలో అవినీతికి పాల్పడి, అధికారులను కూడా జైల్లో పెట్టించారని మండిపడ్డారు…

Image result for chandra babu

ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మరిచిపోలేదని చెప్పుకొచ్చారు…. తాను కేవలం టీమ్ లీడర్‌ను మాత్రమేనన్నారు. అధికారులు, మంత్రులు, ప్రజలు.. టీమ్ సభ్యులు అని వ్యాఖ్యానించారు… అవినీతి జరిగితే ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రానికి మొదటి స్థానం ఎలా వస్తుందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు…. ఇలాంటి చిల్ల‌ర వ్యాఖ్య‌లు తాను ప‌ట్టించుకోను అని కొట్టిపారేశారు బాబుగారు.