నేనే సీఎంల‌లో అంద‌రి కంటే సీనియ‌ర్

421

సీఎం చంద్ర‌బాబు కేంద్రం పై పోరాటం మ‌రింత తీవ్ర‌త‌రం చేస్తున్నారు… తెలుగుదేశం ఎంపీల గొంతు పార్ల‌మెంట్లో వినిపించకుండా బీజేపీ అడ్డుకుంటోంది అని అన్నారు… పార్ల‌మెంట్ సాక్షిగా ప్ర‌ధాని నరేంద్ర మోడీ టీడీపీ ఎంపీల‌ను బెదిరించార‌ని సీఎం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.. తాను బీజేపిని ఓడించాల‌ని పిలుపుని ఇస్తే, క‌ర్ణాటక ప్ర‌జ‌లు త‌న మాట విన్నార‌ని, బీజేపీకి ఓడించార‌ని అన్నారు.. దేశంలో అందరు సీఎంల క‌న్నా తాను సీనియ‌ర్ అని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ గుజ‌రాత్ సీఎం అవ్వ‌క‌ముందే తాను సీఎం అయ్యాను అని సీఎం మ‌రోసారి త‌న గురించి తెలియ‌చేశారు.

Image result for chandra babu

ప్రత్యేక హోదాపై మోదీనే యూటర్న్‌ తీసుకున్నారని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రాప్‌లో నేను పడలేదని అన్నారు సీఎం చంద్ర‌బాబు. మోడీ జ‌గ‌న్ వైసీపీ ట్రాప్ లో ప‌డి తెలుగుదేశాన్ని త‌క్కువ అంచనా వేశారు అని ఆయ‌న అన్నారు.. బీజేపీ యూట‌ర్న్ తీసుకుని మ‌ళ్లీ మ‌న‌ల్ని త‌ప్పుబ‌డుతున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు… కేంద్రం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెర‌వేర్చ‌లేదు అని ఆయ‌న విమ‌ర్శించారు..

Image result for chandra babu

కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మించకపోతే తామే సొంతగా కట్టుకుంటామని ఆయ‌న తెలియ‌చేశారు.. కేంద్రం ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల్సిన బాధ్య‌త వారిదే అని అన్నారు ..రాష్ట్ర విభజన తరువాత ఆదాయమంత హైదరాబాద్‌కే వెళ్తోంది అని ఆంధ్రాకు అన్యాయం చేశారు అని కేంద్రం పై ఆయ‌న విమ‌ర్శ‌ల బాణాలు సంధించారు.. దేశంలో మోదీ అవినీతి ప్రక్షాళన ఏమైంది అని ప్ర‌శ్నించారు.. ఏటీఎంల్లో డబ్బులు రాకపోవడానికి కారణం మోదీనే అని ఆయ‌న అన్నారు.. మోదీ నన్ను విమర్శించడం దురదృష్టకరం ఇలాంటి ప‌రిస్దితి వ‌స్తుంది అని అనుకోలేదు.. టీడీపీ-బీజేపీ మధ్య లేనిపోని గొడవలు వద్దని కొన్ని సందర్భాల్లో కేంద్రాన్ని నిలదీయలేదు అని సీఎం మ‌ధ‌న‌ప‌డ్డారు.