పవన్ కళ్యాణ్ కు కాదని జగన్ వైపు వెళ్లిన ఆలీ కారణం తెలిస్తే షాక్

383

కాంగ్రెస్ కండువా కప్పుకుని మరీ నేను పవన్ కళ్యాణ్ భక్తుడిని అని చెబుతారు బండ్ల గణేష్. పవన్‌ను దేవుడిగా చూసే బండ్ల గణేష్.. జనసేన పార్టీలో మాత్రం చేరలేదు. వెళ్లి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే ఆయన అంతకు ముందు జనసేనలో చేరాలనుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు ఇచ్చిన కొన్ని ఇంటర్యూల్లో పవన్ కనికరిస్తే అధ్యక్షా అని అనాలనిపిస్తోందని అది తన జాతకంలోనే ఉందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఏమైందో కానీ ఆయన జనసేన వైపు చూడలేదు. పవన్ కల్యాణ్ కూడా పట్టించుకోలేదు.తెలంగాణాలో జనసేన నిలబడే స్థితిలో లేదు. కేవలం అది ఆంధ్రపార్టీ కాబట్టే బండ్ల గణేష్ చేరలేదు. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్‌ మరో సన్నిహిత మిత్రుడు ప్రముఖ కమెడియన్ అలీ వెళ్లి జగన్‌తో భేటీ అయ్యారు. ఆ ఫోటోలు ఇప్పుడు.. ఆన్ లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Image result for ali and jagan

మామూలుగా అలీ జగన్‌తో భేటీ అయితే ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోరు. ఓ ఫృద్ధ్వీ, మరో విజయందర్..మరో భానుచందర్ తరచూ ఒకరి తర్వాత ఒకరు పాదయాత్రలో కనిపిస్తూనే ఉంటారు. ఆ కోవలో అలీ కూడా చేరారని అనుకుంటారు. కానీ ఆయన పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతోనే ఇప్పుడు దీనికో విశేషం వచ్చి పడింది. జనసేన పార్టీ పెట్టిన తర్వాత కూడా పవన్ కల్యాణ్ వెంట కడప దర్గా లాంటి చోట్లకు తిరిగారు కూడా. అయినా ఎప్పుడూ ఆ పార్టీలో చేరినట్లు చెప్పలేదు. కానీ హఠాత్తుగా జగన్‌తో సమావేశమయ్యారు. అలీకి రాజకీయ ఆశలు ఉన్నాయి. ఆయన రాజమండ్రిలో ఏవో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. రాజకీయం గురించి అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెబుతూ ఉంటారు. ఇప్పుడు వైసీపీ ద్వారా తన కోరికను తీర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అందరికి తెలియచేయాల్సిన సమాచారం షేర్ చేయండి

పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితులు అయిన బండ్ల గణేష్, అలీ జనసేనలో చేరకపోతే ఎలాంటి నష్టం లేదు కానీ ప్రత్యర్థుల విమర్శలకు ఓ అవకాశం ఇచ్చినట్లవుతోంది. ఆయనకు అంత సన్నిహితులే పార్టీలో చేరకపోతే ఇంకెవరు చేరతారని ఇతర పార్టీల నేతలు విమర్శిస్తారు. దగ్గరగా ఉన్న వాళ్లకే అసలు నిజాలు తెలుస్తాయి కానీ దూరంగా ఉన్న వాళ్లంతా దూరపు కొండలు నునుపు అనుకుంటారనే భావన.. అలీ, బండ్ల గణేష్ లాంటి వాళ్లను చూస్తే అర్థమవుతుందని సెటైర్లు వేస్తున్నారు.చూడాలి మరి క్యాషువల్ గా కలిశాడో లేక వైసిపి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చెయ్యబోతున్నాడో.. తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. జగన్ ను ఆలీ ఎందుకు కలిసినట్టు. పవన్ ను కాదని జగన్ వైపు వెళ్తున్నాడా..మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.