వైయ‌స్ వివేకానంద రెడ్డి మ‌ర‌ణంతో చంద్ర‌బాబు ఏం చేశారో తెలిస్తే షాక్

225

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో కుప్పకూలినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వివేకానందరెడ్డి సొంత తమ్ముడు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది. ఉద‌యం బాత్రూంకి వెళ్లిన స‌మ‌యంలో ఆయ‌న ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్నారు. దీంతో ఆయ‌న‌ను బ‌య‌టకు తీసుకువ‌చ్చి కుటుంబ స‌భ్యులు చూశారు, అప్ప‌టికే ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్టు తెలుసుకున్నారు, ఇక ఇంటిలో ఉద‌యం నుంచి ఎవ‌రూ లేరని ఈ స‌మ‌యంలో ఆయ‌న ఒక్క‌రు మాత్ర‌మే ఇంటిలో ఉన్నారు అని తెలుస్తోంది.

Related image

వైసీపీ తరపున ఆయన పులివెందులలో నిన్న ప్రచారం కూడా చేశారు. ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించారని మార్చి 3వ తేదీన వైఎస్ వివేకా పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఆయన హఠాన్మరణంతో జగన్ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. హుటాహుటిన లోటస్‌పాండ్ నుంచి పులివెందులకు జగన్ కుటుంబ సభ్యులు బయల్దేరారు. ఇక వైయ‌స్ వివేకాని చివ‌రి చూపు చూసేందుకు పెద్ద ఎత్తున నాయ‌కులు చేరుకుంటున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పీఏ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. రక్తపు మడుగులో పడి ఉండటం, తల, చెయ్యికి బలమైన గాయాలు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రింది వీడియో చూడండి 

పోలీసులు డాగ్ స్వ్కాడ్‌ను రంగంలోకి దించారు. వివేకానందరెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం జరుగుతోంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందోనన్న ఆందోళన ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. బాత్రూంలో వైఎస్ వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే.. అప్పటికే ఆయన మృతి చెందారు. ఇక ఎటువంటి గొడ‌వ‌లు ఇంటిలో జ‌ర‌గ‌లేదు అని ఉద‌యం ఆయ‌న‌బాత్రూంకి వెళ్లిన స‌మ‌యంలో ఆయ‌న ఎంత‌కీ తిరిగి రాక‌పోవ‌డంతో అనుమానంతో కుటుంబ స‌భ్యులు లోప‌లికి వెళ్లి చూశారు.. ఆయన అప్ప‌టికే ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్నారు.. దీంతో ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రికి త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నించిన స‌మ‌యంలో ఇక ఆయ‌న లేరు అనే వార్త తెలియ‌చేశారు. ఇక చేతికి గాయాలు త‌ల‌కి బ‌ల‌మైన గాయం ఉండ‌టంతో పోస్టుమార్టం కోసం చూస్తున్నారు, ఇక సీఎం చంద్ర‌బాబు కూడా ఆయ‌న‌కు నివాళి అర్పించారు ఈ విష‌యంపై అనుమానాలు ఉన్న కార‌ణంగా ఈ కేసుని పోలీసులు అన్నికోణాల్లో ప‌రిశీలించాలి అని తెలియ‌చేశార‌ని స‌మాచారం, మ‌రో ప‌క్క వైసీపీ నేత‌లు కూడా వివేకా మ‌ర‌ణంపై వాస్త‌వాలు తెలియ‌చేయాలని పోలీసుల‌ను విచార‌ణ చేయాలి అని కోరుతున్నారు.