సింగర్ బేబీకి చంద్రబాబు ఎంత డబ్బును బహుమతిగా ఇచ్చాడో తెలిస్తే షాక్..

367

మారుమూల పల్లెటూర్లో కూలీగా పొలం పనులు చేసుకుంటూ పాటలు పాడుకునే బేబీ, నేడు తన గాత్ర మాధుర్యంతో ప్రజలు, ప్రముఖులు అభినందనలు అందుకుంటున్నారు. ఆమె ప్రతిభ గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తన ఇంటికి స్వయంగా పిలిపించి ఘనంగా సత్కరించారు. సంగీత దర్శకుడు కోటి ద్వారా చిరంజీవిని కలిసి బేబీ, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొంది. మెగాస్టార్‌ను చూసిన బేబీకి ఒక్కసారిగా కళ్ళు చమర్చాయి, తన జీవితం ఈరోజుతో ముగిసిపోయినా పర్లేదని బేబీ ఆ సమయంలో వ్యాఖ్యానించింది. ఆమెకు ఆతిథ్యం ఇచ్చిన మెగా దంపతులు, ఖరీదైన చీరను, రూ.లక్ష ఆర్ధికసాయం అందజేశారు. అయితే ఇప్పుడు ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి ఆమెకు సత్కరించి బహుమతి ఇచ్చాడు.మరి ఆ విషయం గురించి తెలుసుకుందామా.

Image result for singer baby and chandra babu

ఎలాంటి సంగీత నేపథ్యం, శిక్షణ లేకపోయినా తన పాటలతో ఉర్రూతలూగిస్తోన్న గాయని పసల బేబీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఆమె ప్రతిభ గురించి తెలుసుకున్న చంద్రబాబు అమరావతికి పిలిపించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వ్యవసాయ కూలీగా ప్రస్థానాన్ని ప్రారంభించి సినీ గీతాలతో ఆన్‌లైన్‌లో లక్షలాది మంది శ్రోతలను మెప్పించడం ఎంతో అభినందనీయమని బాబు పేర్కొన్నారు. ఆమెప్రతిభను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనపర్తి నియోజకవర్గం వడిసలేరు గ్రామానికి చెందిన బేబీని ఎంపీ మురళీమోహన్‌, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి శనివారం ఉండవల్లిలో ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. ఎలాంటి సంగీత నేపథ్యం, శిక్షణ లేకున్నా ఒక్కసారి పాట వింటే నేపథ్యగాయకుల స్థాయిలో పాడగలరని మురళీమోహన్‌ వివరించారు. ముఖ్యమంత్రి ఆమెకు లక్ష రూపాయలను గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ సమయంలో బేబీ పాడిన పాటకు చంద్రబాబు ఫిదా అయ్యారు. ఆమె తొలిసారిగా పాడిన పాట మట్టిలో మాణిక్యం అనే పాట చంద్రబాబు ముందు పాడింది.ఆమె జీవితం గురించి తెలిపే చక్కని పాట అది.ఇంకా తనకు చాలా పాటలు నేర్చుకోవాలని ఉందని, ఇంతటి సత్కారం చేసి గౌరవించినందుకు ఎంతో సంతోషంగా ఉందని బేబీ అన్నారు. అయితే ఈమెకు సినీ ఇండస్ట్రీ నుంచి భారీ అవకాశాలు వస్తున్నాయి.ఎఆర్ రెహమాన్ కూడా త్వరలో ఈమె చేత పాట పాడించనున్నాడు.ఆమె ఇలాగే మంచి మంచి పాటలు పాడి ఉన్నత శిఖరాలకు వెళ్లాలని కోరుకుందాం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సింగర్ బేబీ గురించి అలాగే చంద్రబాబు ఆమెను సత్కరించి లక్ష రూపాయలు ఇవ్వడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.