టీఆర్‌ఎస్‌ గెలిస్తే రాజకీయ సన్యాసం- కోమ‌టిరెడ్డి

394

తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు రాజ‌కీయంగా దూసుకుపోతున్నారు.. మ‌రి కొద్ది నెలల్లో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో స్పీడు పెంచుతున్నారు..రానున్న సాధారణ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్‌ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలన్నింటిలో టీఆర్‌ఎస్‌ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తాజాగా న‌ల్గొండ జిల్లాలో ప‌ర్య‌టించిన ఆయ‌న ఈ కామెంట్లు చేశారు.

Image result for trs party logo

 

 

నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట అని, ఎంతమంది కేసీఆర్‌లు వచ్చినా కాంగ్రెస్‌ పార్టీని ఏమిచేయలేరన్నారు. సీఎం కేసీఆర్‌ మాయమాటలకు మరోసారి మోసపోయేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరన్నారు. అబద్దాలు ఆడడంలో సీఎం గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కారని, మరెవరూ ఆ రికార్డుకు చేరుకోలేరన్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కేసీఆర్ ఎన్ని మాట‌లు చెప్పారు అవ‌న్నీ నిల‌బెట్టుకోలేక‌పోయారు అని ఆయ‌న విమ‌ర్శించారు..

Image result for congress logo

తెలంగాణ వ‌స్తే ద‌ళితుడ్ని ముఖ్య‌మంత్రిని చేస్తాను అన్నారు.. ఇంటికో ఉద్యోగం ఎక్క‌డ ఇచ్చారు..కేజీ టు పీజీ విద్య ఎక్క‌డ కొనసాగుతున్నాయన్నారు….బంగారు తెలంగాణ దేవుడెరుగు..అప్పుల తెలంగాణగా రాష్ట్రం మారిందని ఆయ‌న విమ‌ర్శించారు..రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డితే వారి కుటుంబాల‌ను ఆదుకుంటున్నారా అని ఆయ‌న విమ‌ర్శించారు…ప్రజాధనంతో హెలికాప్టర్లలో ఇతర రాష్ట్రాలలో జరిగే పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్లేందుకు మాత్రం సమయం దొరుకుతుందన్నారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు స‌రికొత్త‌గా అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు అని ప్ర‌జ‌లు చర్చించుకుంటున్నారు..