TRS గెలిచిన వెంటనే కెసిఆర్ ఎవరికి ఫోన్ చేసాడో తెలిస్తే షాక్ అవుతారు

466

తెలంగాణ ఎన్నికలలో చివరి అంకం ముగిసింది.తెలంగాణ ప్రజల మనసులు దోచుకున్న కెసిఆర్ మళ్ళి గెలిచాడు.ఆయన చేసిన అభివృద్ధి పనులే ఆయనను గెలిపించాయి. ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టనున్నాడు.రేపు ప్రమాణ స్వీకారం చెయ్యనున్నాడు. కారు దూకుడుకు కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు కూడా వెనుకంజలో పడ్డారు. కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి, నాగార్జున‌సాగర్‌లో జానారెడ్డి ఓడిపోయారు.. రేవంత్‌పై టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డి ఘనవిజయం సాధించాడు. జానారెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య విజయం సాధించారు.. జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఓడిపోయారు. శేరిలింగంలపల్లి, కూకట్‌పల్లిలో నియోజకవర్గాల్లోనూ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. టీఆర్‌ఎస్ పార్టీ దూకుడు కనబరచి విజయం సాధించింది.. కూకట్‌పల్లిలో టీడీపీ నుంచి బరిలోకి దిగిన నందమూరి సుహాసిని ఓడిపోయారు.. జగిత్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఓడిపోయారు.

Image result for pawan kalyan

ఆయనపై టీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ గెలుపొందారు. చాంద్రయాణగుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ గెలుపొందారు.అలాగే అంబర్ పేట్ లో కిషన్ రెడ్డి ఓడిపోయాడు.అయితే తెరాస నేతలు మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు జూపల్లి కృష్ణారావు,స్పీకర్ మధుసూదనాచారి ఓడిపోవడం తెరాస పార్టీని కొంచెం భాదకు గురి చేసింది.ఫలితాల్లో ఆది నుంచే టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు 91 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉండగా.. 16 స్థానాల్లో కాంగ్రెస్, 4 స్థానాల్లో బీజేపీ, 5 స్థానాల్లో ఎంఐఎం, 3 స్థానాల్లో స్వతంత్య్ర అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.అయితే దాదాపుగా కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం కంఫార్మ్ అయిపోయింది.2014 లో జరిగిన ఎన్నికలలో ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆ తర్వాత కెసిఆర్ చేపట్టిన అద్భుతమైన పథకాలు జనాలకు బాగా నచ్చడంతో ముందస్తుకు వచ్చినా కూడా గెలిపించారు.భారీ సంఖ్యలో శాసనసభ స్థానాలను గెలుచుకుంది.ఇక ముఖ్య విషయానికి వస్తే..మీకు అన్ని విధాలా మంచి చేసిన ప్రభుత్వానికే మీ ఓటు వెయ్యండని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ఓటర్లకు విజ్ఞప్తి చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.తెరాస పార్టీకి మా మద్దత్తు ఉంటుందని ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తెరాస పార్టీకి వేశారు.నేడు విడుదల అయినా ఫలితాలలో తెరాస పార్టీ ఘనవిజయం సాధించడంతో కెసిఆర్ పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పినట్టు సమాచారం.ఇక పవన్ కళ్యాణ్ కూడా కంగ్రాట్స్ చెప్తూ తెలంగాణ రాష్టాన్ని మరింత అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నా అని అన్నాడంట.ఇలా ఇద్దరి మధ్య కొద్దిసేపు ముచ్చట్లు జరిగాయంట.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.తెలంగాణ ఎన్నికల ఫలితాల గురించి అలాగే పవన్ కళ్యాణ్ కు కెసిఆర్ ఫోన్ చెయ్యడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.