సీఎం బావమరిది ఇంట్లో రూ.300 కోట్లు ఏం చేశారో తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం

249

ఎన్నికల వేళ నోట్ల కట్టలు పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి.. ఎక్కడ చెక్ చేసినా కోట్ల రూపాయలు పోలీసులుకు దొరుకుతున్నాయి, అలాగే మద్యం ఏరులై పారుతోంది.. తాజాగా మధ్యప్రదేశ్‌, ఢిల్లీలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గత రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 50 ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా, సీఎం బావమరిది నివాసంలో రూ.281 కోట్లు నగదు లభ్యమైంది. గోనె సంచులు, అట్టపెట్టెల్లో దాచిన ఈ మొత్తం ఓటర్లకు పంచేందుకు దాచిపెట్టినట్టు అధికారులు భావిస్తున్నారు. కమల్ నాథ్ బంధువుల ఇళ్లలో సోదాలు జరిపిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు, లెక్కల్లో చూపని ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకే చోట ఇంత పెద్ద మొత్తం నగదు లభ్యంకావడంతో అధికారులు విస్తుపోయారు. దీనిని తరలించేందుకు లారీని ఏర్పాటు చేయడం విశేషం.

ఇదే సమయంలో కమల్‌నాథ్‌కు మరో సన్నిహితుడి ఇంట్లో రూ. 14.6 కోట్ల నగదు సీజ్ చేశామని, కంప్యూటర్లు, కొన్ని కీలక పత్రాలు దొరికాయని అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్, ఢిల్లీ మధ్య చాలా నగదు బట్వాడా జరిగినట్టు గుర్తించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు, విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఐటీ దాడులను రాజకీయ కుట్రగా మధ్యప్రదేశ్ సీఎం అభివర్ణించారు. ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కైన బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని కమల్‌నాథ్ ఆరోపించారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు దాదాపు 200 మంది ఐటీ అధికారులు, పోలీసులతో కూడిన బృందాలు ఇండోర్, భోపాల్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మెరుపు దాడి చేశాయి. కమల్‌నాథ్‌కు గతంలో ఓఎస్డీగా పనిచేసిన ప్రవీణ్ కక్కర్, మాజీ సలహాదారు రాజేంద్ర మింగ్లానీ నివాసాలతోపాటు ఆయన బావమరిది నివాసంలో తనిఖీలు చేపట్టారు.

Image result for కమల్‌నాథ్‌కు

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొద్ది రోజుల ముందే కక్కర్, మింగ్లానీలు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. మాజీ పోలీస్ అధికారి అయిన కక్కర్ గతంలో కేంద్ర మాజీ మంత్రి కాంతీలాల్ భూరియా‌కు ఓఎస్డీగా పనిచేశారు. గత డిసెంబరులో జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో కమల్ నాథ్ సీఎం అయ్యారు. దీంతో కక్కర్‌ను తన ఓఎస్డీగా సీఎం నియమించారు. వీరి కుటుంబానికి కూడా హాస్పిటాలిటీ సహా పలు వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయి. మాజీ మంత్రి కాంతీలాల్ భూరియా ప్రస్తుతం రత్లాం-ఝబ్యూ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇలా ఎన్నికల వేళ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడటంతో రాజకీయంగా పెద్ద దుమారం వస్తోంది అలాగే ప్రజల సొమ్ము కమీషన్ల రూపంలో తినేసి మళ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఖర్చు చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు.