వివేకా హత్య కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు షాక్ లో జ‌గ‌న్ చంద్ర‌బాబు

301

క‌డ‌ప‌లో వైయ‌స్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో సిట్ విచార‌ణ ముమ్మ‌రం చేసింది .. ఇందులో ఎంత మంది నిందితులు అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు ఈ కేసుపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. వివేకా హత్యలో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని సీఎం చంద్రబాబు పదేపదే ఆరోపిస్తున్నారని, ఈ నేపథ్యంలో సిట్‌ తుది నివేదిక దాఖలు చేయకుండా ఆపాలని కోరుతూ వైఎస్ సౌభాగ్య, జగన్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు అందుకు నిరాకరించింది. అలాగే, ఎన్నికల నేపథ్యంలో తదుపరి విచారణ చేపట్టే వరకు దర్యాప్తు వివరాలను మీడియాకు వెల్లడించారదన్న అభ్యర్థనపై కూడా విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఈ క్రింది వీడియో చూడండి

అంతకు ముందు ఎన్నికల ముందు సిట్ దర్యాప్తుపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఎన్నికలు ముగిసే వరకు సిట్ మీడియా సమావేశం నిర్వహించకుండా ఆదేశించాలని కోరారు. దీంతో ఎన్నికలు ముగిసేవరకు సిట్‌ మీడియా సమావేశాలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది. అయితే, కేసు విచారణ మాత్రం కొనసాగించాలని స్పష్టం చేసింది. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌, వైఎస్‌ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్య, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ ఈ పిటిషన్లను దాఖలు చేశారు. మొత్తానికి ఈ పిటిష‌న్ల పై విచార‌ణ సాగినా ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయ పార్టీల‌కు ఈ కేసు త‌ల‌నొప్పిగా మారింది జ‌గ‌న్ కుటుంబం నుంచి వైయ‌స్ కుటుంబం నుంచి రెండు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి కొంద‌రు కుట్ర ప‌న్ని తెలుగుదేశం నేత‌లు చేసిన హ‌త్య అని అంటుంటే మ‌రో ప‌క్క జ‌గ‌న్ బంధువులు బాబాయ్ లు మాత్రం ఇది రాజ‌కీయంగా చేస్తున్న విమ‌ర్శ‌లు
అని కొట్టిపారేస్తున్నారుఇక తెలుగుదేశం అధినేత మంత్రులు మాత్రం ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో క‌డ‌ప జిల్లాలో ఎలాంటి దారుణం జ‌రిగిందో చూశారా, జ‌గ‌న్ బాబాయ్ హ‌త్య‌ని కూడా రాజ‌కీయం చేశాడు, వారే నిందితులు అంటూ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేస్తున్నారు, మొత్తానికి రాజ‌కీయంగా ఇవి పెద్ద దుమారం లేపుతున్నాయి. మ‌రి చూడాలి చివ‌ర‌కి సిట్ ఎవ‌రిని దోషులుగా తేలుస్తుందో.