జనసేన ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు

130

ఈ ఎన్నిక‌ల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది 151 స్ధానాలు గెలుచుకుంది, ఇక తెలుగుదేశం పార్టీ 23 సీట్లు గెలుచుకుంది, అలాగే జ‌న‌సేన కేవ‌లం ఒక్క‌స్ధానం గెలుచుకుంది, ప‌వన్ క‌ల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓట‌మిపాల‌య్యారు, ఇక తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలులో జ‌న‌సేన జెండా ఎగుర‌వేసింది, ఆ పార్టీకి ఆయ‌నే అసెంబ్లీలో పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇక ఇటీవ‌ల ఆయ‌న పేరు తెర‌పైకి బాగా వినిపిస్తోంది.

Image result for రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు

జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు హైకోర్టు షాకిచ్చింది. ఎన్నికలకు సంబంధించి మంగళవారం నోటీసులు జారీ చేసింది. రాపాక గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని, బ్యాలెట్ ఓట్లలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. రాజోలు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ బొంతు రాజేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. జనసేన ఎమ్మెల్యేకు, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేశారు.రాపాకపై వస్తున్న దొంగ ఓట్లు, రిగ్గింగ్ ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారిని హైకోర్టు ఆదేశించింది. అలాగే రాపాకకు నోటీసులు పంపించారు. ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మరో మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్, వైఎస్సార్‌సీపీ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ క్రింద వీడియో చూడండి

రాపాక వరప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు.. దీంతో 2009లో వైఎస్ రాజేశేఖర్‌రెడ్డి రాజోలు నుంచి టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో ఘన విజయం కూడా సాధించారు. 2014 ఎన్నికలు, ఆ తర్వాత రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న ఆయన.. 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. అధినేత పవన్ కళ్యాణ్ రాజోలు నుంచి ఎమ్మెల్యే టికెట్ కేటాయించగా.. ఆ పార్టీ నుంచి గెలిచి ఏకైక ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఆయ‌న‌పై ఇలా ఆరోప‌ణ‌లు రావ‌డంతో త‌మ పార్టీ త‌ర‌పున ఉన్న ఒక్క సీటు కూడా ఉంటుందా ఉండ‌దా అని జ‌న‌సేన నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు, అయితే ఈ వ్య‌వ‌హ‌రంలో కోర్టులో తాము గెలుస్తాం అంటోంది జ‌న‌సేన‌. ఇక జనసేన ఎమ్మెల్యేకు, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ కావ‌డంతో ఏపీ అంతా ఇదే చ‌ర్చ‌కు వస్తోంది, రాజోలులో జ‌న‌సేన జెండాపై చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి మూడు వారాల్లో ఎలాంటి తీర్పు వ‌స్తుందో చూడాలి.

ఈ క్రింద వీడియో చూడండి