తెలంగాణ స్పీకర్ కు హైకోర్టు నోటీసులు..

368

తెలంగాణ స్పీకర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది ..కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ సభ్యత్వాల రద్దు కేసుకు సంబంధించి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది..కోర్టు ఆదేశించినా ఆ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని పునరుద్దరించకపోవడంతో తెలంగాణ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర న్యాయశాఖ సెక్రటరీలకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలు పాటించనందుకు న్యాయమూర్తి శివశంకర్ ఫామ్ 1 జారీ చేస్తూ… వచ్చే నెల 17వ తేదీన తెలంగాణ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర న్యాయశాఖ సెక్రటరీ విచారణకు స్వయంగా హాజరు కావాలని స్పష్టం చేశారు. అలాగే ఈ ఇద్దరు ఎమ్మెల్యేల జీతభత్యాలు, అసెంబ్లీ రిజిస్టర్ సమర్పించాలని ఆదేశాలు ఇచ్చారు.

ఫిబ్రవరి లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ శాసన సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల శాసన సభ్యత్యం రద్దు చేయడమే కాకుండా, సభ నుంచి బహిస్కర్సితూ నోటీసులు జారీ చేసారు..దీన్ని సవాల్ చేస్తూ వారిద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులను తప్పుబట్టడమే కాకుండా వాటిని రద్దు చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌లో తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కాలయాపన జరపడంతో వీరిద్దరూ మళ్లీ కోర్టు మెట్లు ఎక్కారు.