బ్రేకింగ్ — బస్సులన్నీ ఏపీఎస్ ఆర్టీసీవే కేసీఆర్ కు షాకిచ్చిన కోర్టు

860

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు పొగడ్తలతోనే చురకలు అంటించింది…ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఎన్నో పథకాల్లో పొరుగు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వాన్ని నేను గౌరవిస్తాను. 48 వేల మంది కోసం కాదు.. 6 కోట్ల మంది కోసం పునరాలోచన చేయండి. రూ.49 కోట్లు ప్రభుత్వానికి పెద్ద మొత్తం కాదు.ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం ఇంత మంకుపట్టు పడుతుందని మేం భావించలేదు. ప్రభుత్వం ఒకవైపు, సంఘాలు మరోవైపు మొండి పట్టు పడుతున్నాయి. దేనికైనా పట్టువిడుపులు ఉండాలి. మీ మధ్యలో కోట్లాది మంది ప్రజలు అవస్థలు పడుతున్నారనే విషయం గమనించాలి. పెద్ద మనసు ఉండాలి. ముందుగా పెద్దలే తగ్గాలి. ఇది హైకోర్టు నుంచి నిన్న వచ్చిన మాట, అయితే దీనిపై కేసీఆర్ సర్కారు ఏమీ మాట్లాడటం లేదు.

Image result for trs samme

ఏపీఎస్ ఆర్టీసీ విభజన, పునర్‌నిర్మాణం ఇంకా జరగలేదని, అందువల్ల, టీఎస్ ఆర్టీసీకి చట్టబద్ధత లేనట్లేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రత్యేక చట్టం ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పాటైందని, దాని ప్రకారమే ఇప్పుడు విభజన కూడా జరగాలని తేల్చి చెప్పింది. సమ్మె విరమించాలని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీకి, గుర్తింపు పొందిన కార్మిక సంఘాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఉస్మానియా వర్సిటీ విద్యార్థి ఆర్‌.సుబేందర్‌సింగ్‌, మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ హైకోర్టుకు కేంద్రం వాదనను నివేదించారు. టీఎస్ ఆర్టీసీకి చట్టబద్ధత లేదని తెలిపారు. మోటారు వాహనాల చట్టం 1950లోని సెక్షన్‌ 47 (ఏ) ప్రకారం ఆర్టీసీని పునర్నిర్మాణం చేయాలన్నా, విభజన చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలని స్పష్టం చేశారు.

Image result for trs samme

ఇంతవరకూ అలాంటి అనుమతులు పొందలేదని తేల్చి చెప్పారు. ఏపీఎ్‌సఆర్టీసీ నుంచి టీఎ్‌సఆర్టీసీ వేరుపడలేదు. ప్రస్తుతం నడుస్తున్న టీఎ్‌సఆర్టీసీ తాత్కాలికమైనది. అలాగే, కేంద్రం వాటా 33 శాతం దానంతట అదే టీఎ్‌సఆర్టీసీకి రాదు. చట్టబద్ధంగా వేరుపడిన తర్వాతే వస్తుంది. అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి అని వివరించారు. దాంతో, చట్ట ప్రకారం టీఎ్‌సఆర్టీసీ వేరుపడలేదని, ఆస్తులు, అప్పుల పంపకాలు జరగలేదని, ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు మరుగుపర్చారని ధర్మాసనం ప్రశ్నించింది. దాంతో, ఆర్టీసీ చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం టీఎ్‌సఆర్టీసీని ఏర్పాటు చేశామని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ కోర్టుకు తెలిపారు. ఏపీఎ్‌సఆర్టీసీ పునర్‌ విభజన అంశం పెండింగ్‌లోనే ఉందన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోను కోర్టు పరిశీలనకు ఇచ్చారు.

ఈ క్రింద వీడియో చూడండి

కొత్త కార్పొరేషన్‌కు నిధులు మంజూరు చేసి కొత్త బస్సులు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న బస్సులన్నీ ఏపీఎ్‌సఆర్టీసీకి చెందినవే అవుతాయి అని వ్యాఖ్యానించింది. రాష్ట్రం విడిపోయి ఆరు సంవత్సరాలు కావస్తోందని, ఆర్టీసీ విభజనకు సంబంధించి కేంద్రానికి ఏదేని లేఖ రాశారా..? అని ఆరా తీసింది. పునర్విభజన చట్టంలోని షెడ్యుల్‌-9లో ఉన్న సంస్థలు వేరు. ఆర్టీసీ వేరు. ప్రత్యేక చట్టం ద్వారా ఆర్టీసీ ఏర్పాటైంది. దాని విభజన కూడా ఆ చట్ట ప్రకారమే జరగాలి అని అభిప్రాయపడింది. దీంతో టీఎస్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని చర్చ అయితే మొదలైంది.

ఈ క్రింద వీడియో చూడండి