ఆర్టీసీ యూనియన్లకు హైకోర్టు క్లాస్..

811

తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ.. ఆర్టీసీ విలీనంతో పాటు అన్ని అంశాల మీదా చర్చించాల్సిందేనని పట్టుబట్టాయని, కోర్టు చెప్పిన ప్రకారం 21 డిమాండ్ల మీద చర్చిద్దామన్నా వినలేదని కోర్టుకు తెలిపారు. యూనియన్ నాయకులు చర్చలు జరపకుండానే బయటకు వెళ్లిపోయారని కోర్టుకు ఏఏజీ విన్నవించారు. దీంతో విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టి మిగిలిన అంశాలపై చర్చించాలని ఆర్టీసీ యూనియన్లకు హైకోర్టు సూచించింది. ఒక్క డిమాండ్‌పై పట్టుబట్టకుండా మిగిలిన డిమాండ్ల మీద చర్చించాలని ఆదేశించింది. రాత్రికి రాత్రి విలీనం కావాలంటే ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించింది. అయితే కోర్టు ఆదేశాలను అధికారులు తప్పుగా అన్వయించుకున్నారని యూనియన్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. మొత్తం 45 డిమాండ్లలో ఆర్థిక భారం కాని వాటిపై చర్చించాలని తాము ఆదేశించినట్టు న్యాయమూర్తి తెలిపారు.

Image result for trs samme

విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టి మిగిలిన అంశాలపై చర్చ జరపకపోతే ఇదే ప్రతిష్టంభన కొనసాగుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇరు వర్గాల మధ్య సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మరోసారి గుర్తు చేసింది. నిన్న జరిగిన చర్చల వివరాలతో ఆర్టీసీ యాజమాన్యం కోర్టుకు అదనపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. చర్చల సమయంలో అన్ని డిమాండ్లపైనా చర్చించాల్సిందేనని కార్మిక సంఘాలు పట్టుబట్టినట్టు ఆ నివేదికలో పేర్కొంది. మొత్తం 45 డిమాండ్లతో సమ్మె చేస్తుంటే.. కేవలం 21 డిమాండ్లే అన్నట్టుగా ఆర్టీసీ యాజమాన్యం తప్పుడు ప్రచారం చేస్తోందని యూనియన్ల తరఫు న్యాయవాది దేశాయ్ ప్రకాష్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఇక కోర్టు కూడా ఇలాంటి సమాధానం చెప్పడంతో తీర్పుతో ఆర్టీసీ యూనియన్ నేతలు షాక్ అయ్యారు. కచ్చితంగా ప్రభుత్వం అన్ని డిమాండ్లు నెరవేర్చాలి అని అంటున్నారు. అంతేకాదు మరోసారి కోర్టు ముందుకు ఈ విషయాలు తీసుకువెళతాం అంటున్నారు, అయితే ప్రభుత్వంలో విలీనం కాకుండా మిగిలిన అంశాలను పరిశీలించాలి అని కోర్టు చెప్పడంతో ఇక ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం కూడా ఆధిశగా కార్మికులతో చర్చలు జరుపనుంది, ఇక అవి కూడా సఫలం కాకపోతే కోర్టులోనే ఈ విషయం తేల్చుకోవాలి అని చూస్తోంది ప్రభుత్వం, ఉద్యోగులు సమ్మె నుంచి రాకపోతే, కేసీఆర్ కూడా ప్రైవేట్ బస్సులకు పర్మిట్ ఇచ్చి తెలంగాణ రోడ్లపై నడిచేలా చేయనున్నారట.

ఈ క్రింద వీడియో చూడండి