ఏపీతో పాటు ఏడు రాష్ట్రాల్లో హై అలెర్ట్ .. పుల్వామా తరహా ఉగ్రదాడులకు స్కెచ్

168

పాకిస్ధాన్ ఆలోచనలు నిత్యం విషంతోనే ఉంటాయి అవి ఎలా ప్రయోగిస్తుందో తెలియదు.. ముఖ్యంగా వారికి ఉన్న ప్రధాన ఆయుదం ఉగ్రమూకలు, అందుకే వారితోనే ముందు అడుగులు వేయిస్తుంది. ఇఫ్పుడు భారత్ పై కూడా అలాంటి ప్రణాళికలతోనే ఉంది .ముఖ్యంగా మోదీ సున్నిత ప్రాంతం కశ్మీర్ ని టార్గెట్ చేశారు కాబట్టి, ఇండియాలో కూడా సున్నిత ప్రాంతాలని టచ్ చేయాలని ఉగ్రవాదుల ప్రణాళిక వేస్తున్నారట. ఈ హాడావుడిలో ఆర్మీ గస్తీ ఎక్కువగా ఉంటుంది ప్రతీ స్లీపర్ సెల్ ఈజీగా దొరుకుతాడు. అందుకే వారితో కాకుండా కొత్త టీమ్ తో ఉగ్రదాడులు చేయాలని చూస్తోంది. పాకిస్ధాన్ కు ఆర్టికల్ 370 రద్దు అంశం మింగుడుపడటం లేదు, అందుకే భారత్ పై దాడి జరిగినా అది ఉగ్రవాదులు చేసిన దాడిగా చెప్పాలని చూస్తోంది. కశ్మీర్ ప్రజలకు ఇష్టం లేని నిర్ణయం భారత్ తీసుకుంది కాబట్టే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అని ప్రొజెక్ట్ చేయాలని పక్కా స్కెచ్ వేస్తోంది.

Image result for kashmir

అందుకే ఆర్టికల్ 370ని రద్దు పై పాకిస్తాన్ అట్టుడుకుతోంది. జమ్ముకశ్మీర్ కు ఏడు దశాబ్దాలుగా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో పాకిస్థాన్ తో పాటు ఆ దేశ ప్రేరేపిత ఉగ్రవాదులు అసహనంతో రగిలిపోతున్నారు. మరోవైపు భారత దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సమయం ఆసన్నమవుతుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న భారత్ లో భారీ ఎత్తున ఉగ్రదాడులకు దిగాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచారం అందించాయి.

Image result for hyd

ఈ నేపథ్యంలో కశ్మీర్ లోయతో పాటు ఏడు రాష్ట్రాల్లో జైషే ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఆర్మీ, పోలీస్, ఇతర భద్రతాదళాలపై పుల్వామా తరహా దాడులు చేసే దిశగా ఉగ్రవాదులను పాక్ కు చెందిన ఐఎస్ఐ ప్రేరేపిస్తోందని హెచ్చరిస్తున్నాయి .ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ తో పాటుగా, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ ఉగ్ర దాడుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.

A screenshot of a video in circulation showing DCP V. Harashavardhan Raju holding a medico by his collar before slapping him, in Vijayawada on Wednesday.

దేశంలోని అన్ని విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు . దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడొచ్చని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించడంతో అప్రమత్తమయ్యారు విమానయాన శాఖ అధికారులు. ఆగష్టు 15తో పాటు, కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఆగ్రహంతో ఉన్న ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చని నిఘా వర్గాల హెచ్చరికలతో ఈరోజు నుండి ఈ నెల 20వ తేదీ వరకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్ ప్రకటించారు . ఈ నెల 20వ తేదీ వరకు విమానాశ్రయంలోకి సందర్శకులను అనుమతించరు. అలాగే అన్ని రకాల పాసులను కూడా రద్దు చేశారు. ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అధికారులు. ఇక తనిఖీలు చేసిన తర్వాతే వాహనాలను ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లోకి అనుమతిస్తున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

దాడులకు తెగబడేందుకు ఉగ్రమూకలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు హెచ్చరించిన ఐబీ అధికారులు సామాన్య ప్రజలే టార్గెట్‌గా విరుచుకుపడేలా కుట్రలు జరుగుతున్నాయని చెప్తున్నారు . ఆత్మాహుతి దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. దీంతో ఇంటెలిజెన్స్ హెచ్చరించిన ప్రధాన రాష్ట్రాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు . ఒకపక్క జమ్మూ కాశ్మీర్ పునర్విభజన , మరోపక్క త్వరలో రాబోతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు .. ఈ నేపధ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు .అందుకే తెలియని వ్యక్తులు ఎవరు కనిపించినా కచ్చితంగా పోలీసులకు సమాచారం అందించండని చెబుతున్నారు పోలీసులు.