శోక‌సంద్రంలో క‌రుణానిధి అభిమానులు త‌మిళ‌నాడులో హై అల‌ర్ట్

2724

దేశంలోనే అత్యంత సీనియ‌ర్ రాజకీయ నేత త‌మిళ‌నాడు మాజీ సీఎం డీఎంకే అధినేత క‌రుణానిధి ఆరోగ్యం విష‌మించి దీంతో ఆయ‌న అభిమానులు శోక‌సంద్రంలో ఉన్నారు ఆయ‌న‌కు ఏమీ అవ్వ‌కూడ‌దు అని ఆరోగ్యంగా ఉండాలి అని డీఎంకే కార్య‌క‌ర్త‌లు దేవునికి ప్రార్ధ‌న‌లు చేసుకుంటున్నారు..కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించింది. ఐసీయూలో కరుణానిధికి ఎనిమిది మంది వైద్యుల బృందం ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు. కావేరి ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ బులెటెన్ విడుదల చేశారు. కరుణానిధి వైద్యానికి సహకరిస్తున్నారని.. ఆయనకు ప్రమాదం లేదని. వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఆయన ఉన్నట్లు తెలిపారు . అయితే ఆయన కుటుంబ సభ్యులు, డీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున హాస్పిటల్‌కు చేరుకుంటున్నారు.

Image result for karunanidhi
తమిళనాడు సీఎం పళనిస్వామి సేలం పర్యటనను రద్దు చేసుకొని చెన్నై బయల్దేరారు. కరుణానిధి కుటుంబ సభ్యులు కావేరి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద ఖాళీ అంబులెన్స్‌ను రెడీగా ఉంచారు. దీంతో చెన్నై నగరం అంతా హై అలర్ట్ ప్రకటించారు. పోలీసుల సెలవులను రద్దు చేసి మరీ అందర్నీ అందుబాటులో ఉండాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి. డీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను పెంచారు. ఆస్పత్రి బయట భారీ గా చేరుకున్న డీఎంకే కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. అభిమానుల ఆందోళనతో ఆస్పత్రి ద‌గ్గ‌ర స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కరుణానిధి కోలుకోవాలని భారీ ఎత్తున నినాదాలు చేస్తున్నారు.

Image result for karunanidhi

భారీ స్థాయిలో ఆసుపత్రి వద్దకు అభిమానులు చేరుకోవడంతో పోలీసులు వారిని అదుపు చేస్తున్నారు. ఆసుపత్రి ప్రాగణంలోకి డీఎంకే కార్యకర్తల్ని అనుమతించకపోవడంతో పోలీసులపైకి చెప్పులు రాళ్లతో తిరగబడ్డారు. దీంతో పోలీసులు, డీఎంకే కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కార్యకర్తల్ని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు పోలీసులు. ఆసుపత్రి ద‌గ్గ‌ర ఉద్రిక్తత నెలకొనడంతో స్టాలిన్, అతని కొడుకు ఉదయనిధి తిరిగిపయనమయ్యారు. వీరితోపాటు మాజీ కేంద్రమంత్రి దయానిధి మారన్, రజితీ మమ్మల్‌లు కూడా ఆసుపత్రికి వ‌చ్చి అక్క‌డ నుంచి వెళ్లిపోయారు..

కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళనలో ఉన్న డీఎంకే కార్యకర్తలు సంయమనం పాటించాలంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు స్టాలిన్. కార్యకర్తలు ఎలాంటి అవాఛనీయ ఘటనలకు పాల్పడవద్దని పోలీసులకు సహకరించాలన్నారు స్టాలిన్. ఆయన కోలుకుంటున్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు స్టాలిన్. …కాగా కరణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనకు గురౌతున్న డీఎంకే కార్యకర్తలతో మాట్లాడారు డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి ఎ. రాజా. ఆయన స్పందిస్తూ.. కరుణానిధి ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దని.. డీఎంకే కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారాయన. మ‌రో రెండు గంట‌ల్లో ప‌రిస్దితి తెలియ‌చేస్తామ‌న్నారు డాక్ట‌ర్లు. దీంతో పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌ల‌తో చెన్నైలోని డీఎంకే కార్యాల‌యంద‌గ్గ‌ర నేత‌లు కార్య‌క‌ర్త‌లు చేరుకుంటున్నారు.