ఓడిపోయాక రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు

400

తెలంగాణ‌లో మ‌రోసారి టీఆర్ఎస్ పార్టీ గెలిచి రెండోవ సారి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నుంది. తెలంగాణలో రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు కేసీఆర్ సిద్దం అవుతున్నారు. ఆనాడు ఉద్యమనాయకుడిగా బరిలో దిగిన కేసీఆర్ 2014లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం నాయకత్వం వహించారు నేడు పరిపాలన కోసం నాయకత్వం వహిస్తున్నారు కేసీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాధారణంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాలేదు. తెలంగాణలో మాత్రం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి తిరిగి అధికారం చేపట్టబోతున్నారు. కొత్త చరిత్ర లిఖించారు. కేసీఆర్‌ను గద్దె దింపేందుకు కాంగ్రెస్ టీడీపీ, టీజేఎస్,కమ్యూనిస్టులు ఒక్కటి అయినప్పటికీ ప్రజలు మాత్రం టీఆర్ఎస్ వైపే తామంతా ఉన్నట్లు స్పష్టమైన మెజార్టీ ద్వారా నిరూపించారు.. తాజాగా తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై రేవంత్ రెడ్డి ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.

Image result for revanth reddy
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పూర్తి స్థాయి విశ్లేషణ చేస్తామన్నారు కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డి. నేటి ఎన్నికల ఫలితాల్లో కారు జోరుకి కుదేలైన కూటమి అభ్యర్ధి రేవంత్ తన సమీప ప్రత్యర్ధి టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పట్నం దేవేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మెజారిటీ తెలాల్సి ఉండగా.. మీడియాతో మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు రేవంత్.

Image result for revanth reddy

టీఆర్ఎస్ పార్టీ ఏమైనా గోల్‌మాల్ చేసి ఎన్నికల్లో గెలిచిందా? అక్రమాలకు పాల్పడిందా? అన్నది పార్టీతో చర్చించిన తరువాత మాట్లాడతాం. రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్‌‌కు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాలు ఎలా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో ఉండి, ప్రజల తరుపున పోరాటం చేస్తాం. గెలిస్తే.. మా మీద ఒకమైన బాధ్యత ఉండేది. ప్రతిపక్షంలో ఉంటే మా బాధ్యత ఇంకా పెరిగింది. ప్రజల సమస్యల్ని లేవనెత్తడంలో ఇంకా పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండకడుతూ పోరాటం చేస్తూనే ఉంటాం.అయితే ఓడిపోతే కుంగిపోవడం.. గెలిస్తే ఉప్పొంగిపోయే లక్షణం కాంగ్రెస్‌కు లేదు. 1956 నుండి జరిగిన ఎన్నికల్లో చాలా ఏళ్లు అధికారంలో ఉంది. గెలుపు, ఓటములను ఒకే విధంగా పరిగణలోనికి తీసుకుంటుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మేం గెలిస్తే.. ప్రజలు మా మీద బాధ్యత పెట్టినట్టు భావిస్తాం.. ఓడిపోతే ప్రతిపక్షంలో ఉంటే పోరాడాల్సిన బాధ్యత మాపై ఉంచారని భావిస్తాం.ఈ గెలుపును రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇచ్చిన లైసెన్స్‌గా భావించాల్సిన అవసరం లేదు. కుటుంబ పెత్తనానికి, కుటుంబ ఆధిపత్యానికి పట్టం కట్టినట్టుగా కూడా వారు భావించాల్సిన అవసరం లేదు. మరింత బాధ్యతతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని నిరుద్యోగులను, రైతులను, ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు రేవంత్ రెడ్డి. మ‌రిరేవంత్ రెడ్డి కూడా ఓట‌మి పాలు అవ‌డంతో ఏకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గొంతు ఎవ‌రు వినిపిస్తారు అనేది పెద్ద ప్ర‌శ్న‌గా ఉంది. మ‌రి దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.