రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌

376

కొద్దిరోజులుగా రాజ్య‌స‌భ ఉప‌స‌భాప‌తి ఎవ‌రా అని అంద‌రూ ఆలోచించారు… మొత్తానికి ఈ ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది అనే చెప్పాలి. రాజ్యసభ ఉపసభాపతి ఎన్నికలో ఎన్డీయేనే విజయం సాధించింది…ఎన్డీయే అభ్యర్థిగా బరిలో దిగిన జేడీయూ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు…ప్ర‌తిప‌క్షాల అభ్య‌ర్ది కాంగ్రెస్ ఎంపీ బీకే హరిప్రసాద్ ఓటమి పాలయ్యారు.

Image result for హరివంశ్‌

డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మొత్తం 230 మంది సభ్యులు ఓటు వేశారు. అందులో ఎన్డీయే కూటమి అభ్యర్థి హరివంశ్‌కు 125 ఓట్లు రాగా.. విపక్షాల అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు 105 ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ పూర్తయిన త‌ర్వాత ఇద్దరు అభ్యర్థులకు పోలైన ఓట్లను బట్టి హరివంశ్ విజయం సాధించినట్లు చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు.

Image result for హరివంశ్‌ఈ ఎన్నిక‌ల ఓటింగ్ లో ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, పీడీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు దూరంగా ఉన్నాయి. ఇద్దరు సభ్యులు సభకు వచ్చి, ఓటు వేయకుండా తటస్థ వైఖరిని అవలంభించారు. టీడీపీ సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్‌కు ఓటేశారు. ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ప్రకటించిన టీఆర్ఎస్ సభ్యులు ఆఖరి క్షణంలో మనసు మార్చుకుని ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేశారు.

Image result for హరివంశ్‌భారత పార్లమెంటు వ్యవస్థలో 26 ఏళ్లుగా రాజ్యసభ ఉపసభాపతి ఏకగ్రీవంగా జరిగింది. అయితే 26 ఏళ్ల తర్వాత నిర్వహించిన ఎన్నికలో జేడీయూ ఎంపీ హరివంశ్ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1956 జూన్‌ 30న జన్మించిన హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ రాంచీలోని బనారస్ యూనివర్శిటీ నుంచి పట్టభద్రులయ్యారు.