టీడీపీపై హ‌రీశ్ రావు స‌టైర్

290

ఏపీలో తెలుగుదేశం పార్టీ ఉంది, ఇక తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ లేదు, ఈ విష‌యాన్ని గుర్తు ఉంచుకోవాలి.. కాని తెలుగుదేశం పార్టీ ఇంకా తెలంగాణ‌లో త‌మ పార్టీకి ఉనికి ఉంది అని అనుకుంటోంది అని, తెరాస నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ది త్యాగాల చరిత్ర, కాంగ్రెస్‌ది వెన్నుపోటు చరిత్ర, తెలంగాణలో టీడీపీది ముగిసిన అధ్యాయమని స‌టైర్ వేశారు తెరాస సీనియ‌ర్ నేత హ‌రీశ్ రావు.

Related image

గజ్వేల్‌లో ముదిరాజ్‌ల ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం పూర్తయితే ముదిరాజ్‌లకు చేతినిండా పని, కడుపునిండా తిండి దొరుకుతుందన్నారు. వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని తెలిపారు. మహాకూటమికి డిసెంబర్‌ 11 తర్వాత ఓటమి తప్పదని ఎద్దేవాచేశారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హరీశ్‌రావు హెచ్చరించారు. తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ఉంది అని వారు అనుకుంటున్నారు.. కాని ఇక్క‌డ ఆ ప‌రిస్దితి లేదు అని ఆయ‌న విమ‌ర్శించారు.