ఆ రికార్డు హ‌రికృష్ణ‌కే సొంతం

365

ఎన్టీఆర్ వారసుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.. అలాగే తిరుగులేని విజ‌యాలు అందుకున్నారు… అలాగే సినిమాల్లో కూడా త‌న‌కంటూ సూట్ అయ్యే పాత్ర‌లు చేసి తిరుగులేని సీత‌య్య‌గా పేరు సంపాదించారు….రాజ‌కీయాల్లో చ‌రిత్ర‌ని సృష్టించిన వ్య‌క్తి అని చెప్పాలి హ‌రికృష్ణ‌ని .. ఇక తొలిసారిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగి ప్ర‌త్య‌ర్ధుల‌కు నిద్ర‌ప‌ట్ట‌నివ్వ‌కుండా రాజ‌కీయంగా ఎదిగారు ఆయ‌న‌.

Image result for hari krishna

అనంతపురం జిల్లా హిందూపురం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఎన్టీఆర్ వారసుడిగా తన సత్తాను చాటుకున్నారు. హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించి అందరి మన్ననలు అందుకున్నారు. హరికృష్ణ మరణ వార్త విన్న హిందూపురం వాసులు శోకసంద్రంలో మునిగారు… ఎన్టీఆర్ మృతితో 1996 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్ది ఆర్ లక్ష్మి నారాయణరెడ్డిపై, 62వేల భారీ మెజారిటీతో హరికృష్ణ గెలుపొందారు. ఇప్పటి వరకు అత్యధిక మొజార్టీతో గెలుపొందిన ఘనత ఆయనకే దక్కింది.

Image result for hari krishna

ఇక నాడు ఎన్టీఆర్ త‌ర్వాత హ‌రికృష్ణ, ఇప్పుడు బాల‌య్య, వ‌రుస‌గా నంద‌మూరి వారసులే రాజ‌కీయంగా ఇక్క‌డ నిల‌బడుతూ విజ‌యం అందుకుంటున్నారు.. అందుకే ఇది టీడీపీ కంచుకోట అని చెబుతారు.. అంతేకాకుండా ఆయన ఎమ్మెల్యేగా, రాష్ట్రంలో ఎన్టీఆర్ మొట్టమొదటి విగ్రహాన్ని హిందూపురంలో ఆవిష్కరించిన ఘనత హరికృష్ణకే దక్కింది. 1996 నుండి నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ప్రజాసమస్యలు పరిష్కరించారు. అందుకే అక్క‌డ ప్ర‌జ‌లు కూడా ఎన్టీఆర్ త‌ర్వాత అంత‌లా హ‌రికృష్ణ‌ని అభిమానిస్తారు.

Image result for hari krishna

రవాణా శాఖ మంత్రిగా ఉండి హిందూపురం ఆర్టీసీ బస్టాండ్‌కు రెండు కోట్ల నిధులు మంజూరు చేయించారు… గ్రామీణ ప్రాంతాలకు సైతం బస్సులు నడపాలని తనే స్వయంగా బస్సులు నడిపి సర్వీసులను ప్రారంభించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో హిందూపురం నియోజకవర్గానికి నిధులు మంజూరు చేశారు. ఇలా త‌న తండ్రి సెగ్మెంట్లో ఆయ‌న త‌ర్వాత తెలుగుదేశం ముద్ర ప‌డేలా ప్ర‌జ‌ల‌కు సేవ‌లు చేసిన ఓ గొప్ప వ్య‌క్తి అని అక్క‌డ ప్ర‌జ‌లు కూడా చెబుతున్నారు.