లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ ఎంపీ కొడుకు అరెస్ట్

511

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కుమారుడు సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి.. అనంతరం జడ్జి ముందు హాజరుపరిచారు. . 10 రోజులుగా కనిపించకుండా పోయిన ఆయన.. అజ్ఞాతం వీడారు. ఇవాళ లాయర్ కృపాకర్ రెడ్డితో కలిసి నిజామాబాద్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. సంజయ్‌ను ఏసీపీ సుదర్శన్‌ ఆధ్వర్యంలో పోలీసులు ప్రశ్నించారు.

sexual harassment case: dharmapuri sanjay attended to police enquiry

ఈ కేసు విషయానికొస్తే.. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నిజామాబాద్ శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థినిలు రెండు వారాల క్రితం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ లేని సమయంలో తన గదిలోకి పిలిపించుకొని వేధించేవాడని ఆరోపించారు. ఈ విషయాన్నిసీరియస్‌గా తీసుకున్న నాయిని.. దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తర్వాత వారు నిజామాబాద్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

విద్యార్థినిల ఫిర్యాదుతో సంజయ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా అజ్ఞాతంలోకి వెళ్లారు. మూడు రోజుల క్రితం తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ సంజయ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణ జరిపి కోర్టు కొట్టేసింది. కేసు విచారణ ప్రక్రియపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. అలాగే అరెస్టు విషయంలో సీఆర్‌పీసీ 41/A సెక్షన్ ప్రకారం వ్యవహరించాలని పోలీసులకు హైకోర్టు సూచించింది. సంజయ్‌పై రెండు రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి.. హైకోర్టు సూచన మేరకు 41/A సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు.