2018 లో ప్రభుత్వ సెలవులు ఇవే

995

2018వ సంవ‌త్స‌రానికి గాను ప్రభుత్వ సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేర‌కు 2018 కొత్త సంవత్సారానికి సంబంధించిన‌ సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ క్రింది వీడియో చూడండి.

తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ ప్ర‌భుత్వ సెల‌వుల‌ను ప్ర‌కిటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సంవత్సరం రోజును ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 28 సాధారణ సెలవులు, 22 ఆప్షనల్ హాలిడేస్ ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌కటించింది. అందులో మూడు ఆదివారాలు, ఒక రెండో శనివారం ఉన్నాయి. బోగి, ఉగాది పండుగలు ఆదివారం వచ్చాయి. ఐచ్ఛిక సెలవులు. అంటే ఆప్షనల్ హాలిడేస్ 22 ఇవ్వగా, అందులో ఒక రెండో శనివారం మిగిలిన నాలుగు ఆదివారాలు ఉన్నాయి.

Image result for holidays

ఐచ్ఛిక సెలవులు చూస్తే. జనవరి 16 న కనుమ, 22న శ్రీపంచమి, ఫిబ్రవరి 1న హజ్రత్ సయ్యద్ మహ్మద్ జన్మదినం, మార్చి 29న మహావీర్ జయంతి, ఏప్రిల్1న హజ్రత్ అలీ జన్మదినం, 15న షబ్‌ఏ మెరాజ్, 18న బసవ జయంతి, 29న బుద్ధ పూర్ణిమ, మే2న షబ్ ఈ బరాత్, జూన్5న షాదత్ అలీ, 12న షాబ్ ఏ ఖదీర్, 15న జుమా అతుల్ వాదా, జూలై14న రథయాత్ర, ఆగష్టు 17న పార్శీల నూతన సంవత్సరం, 24న వరలక్ష్మీ వ్రతం, 26న రాఖీపౌర్ణమి, 30న ఈద్‌ఏ గదీ, సెప్టెంబర్ 20న మొహర్రం, అక్టోబర్ 30న అరెబయీన్, నవంబర్6న నరక చతుర్దశి, డిసెంబర్19న యాజ్ దహుమ్ షరీఫ్, 24న క్రిస్మస్ ఉన్నాయి.

Image result for holidays

అలాగే ఆది, రెండో శనివారాల్లో వచ్చిన పర్వదినాల్లో జనవరి 14 భోగి, మార్చి 18 ఉగాది, ఏప్రిల్ 14 డాక్టర్ అంబేద్కర్ పుట్టిన రోజు, జూన్ 17న రంజాన్ ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేతనంతో కూడిన సెలవు రోజులు 21గా ఖరారు చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం.

Image result for holidays

ఇవిగాక తాము ప్రకటించిన ఐచ్ఛిక సెలవు రోజులలో ఐదింటిని ఉద్యోగులు వాడుకునేందుకు అనుమతించింది. దానికి సంబంధింత‌ ఉన్నతాధికారి నుంచి ముందస్తు అనుమతి తప్పని సరని సూచించింది.

Image result for holidays

పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రజాపనుల శాఖలు, విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తించబోవని, వాటికి సంబంధిత శాఖలు ప్రత్యేకంగా సెలవుల జాబితాను విడుదల చేస్తాయని తెలిపింది. ఈదుల్‌ ఫితర్‌, ఈదుల్‌ జుహా, మొహర్రం, ఈద్‌-ఇ-మిలాద్‌లలో మార్పులు జరిగితే అందుకనుగుణంగా సెలవు తేదీలు మారుతాయని పేర్కొంది.

2018 సంవత్సర రాశిఫలాలు.. మీ జాతకం తెలుసుకోండి!

2018 సంవత్సర రాశిఫలాలు.. మీ జాతకం తెలుసుకోండి!