కేసీఆర్ కు ఊహించని షాకిచ్చిన గవర్నర్ నరసింహన్

178

తెలుగురాష్ట్రాలపాలనలో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి… తెలంగాణ సర్కారుకు గవర్నర్ నరసింహన్ షాక్ ఇచ్చారు. మునిసిపల్ బిల్లు చరిత్రాత్మకం.. ఇందులో ప్రతీ వాక్యం నాదే’’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి, తిరుగులేని విధంగా శాసనసభ ఆమోదం పొందిన మర్నాడే బిల్లు గోడకు కొట్టిన బంతిలాగా గవర్నర్ నుంచి వెనక్కి వచ్చింది. ఇందులోని కొన్ని నిబంధనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయంటూ గవర్నర్ నరసింహన్ అడ్డు చెప్పారు. కొన్ని సవరణలు సూచిస్తూ బిల్లును సభకు తిప్పి పంపినట్లు సమాచారం. గవర్నర్ చర్యతో రాష్ట్ర ప్రభుత్వం కంగు తిన్నది. సాధ్యమైనంత త్వరగా మునిసిపల్ ఎన్నికలు జరపాలన్న తొందరలో ఉన్న ప్రభుత్వం వెనువెంటనే గవర్నర్ సూచనలను బిల్లులో చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. శాసనసభను తిరిగి సమావేశ పరచి, సవరణలకు ఆమోదం పొందడం సుదీర్ఘ ప్రక్రియ కావడంతో ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంది. ఆర్డినెన్స్కు అడ్డం లేకుండా అప్పటికప్పుడు శాసనసభను ప్రొరోగ్ చేసింది.

ఈ క్రింద వీడియోని చూడండి

గవర్నర్ సూచించిన మార్పులతో రూపొందించిన బిల్లుకు ‘‘సర్క్యులేషన్ పద్ధతి’’లో మంత్రివర్గం ఆమోదం తీసుకున్నారు. మంత్రివర్గ తీర్మానాన్ని గవర్నర్కు పంపడంతో ఆయన ఆర్డినెన్స్పై సంతకం చేశారు. వెనువెంటనే గెజిట్ జారీ అయ్యింది. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం తనకు పంపిన బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయవచ్చు. లేదా సవరణలు సూచించవచ్చు. కావాలనుకుంటే రాష్ట్రపతి పరిశీలనార్థం పంపవచ్చు. దీనిలో రెండోపద్ధతిని గవర్నర్ ఎంచుకున్నారు. శాసనసభ ఆమోదం పొందిన బిల్లులోని 195వ సెక్షన్ ప్రకారం.. చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల ఎన్నికల నిర్వహణ తేదీలను రాష్ట్ర ప్రభుత్వమే ఖరారు చేసి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తుంది. ఈ నిబంధనను గవర్నర్ తప్పుపట్టారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని గుర్తు చేశారు.

Image result for kcr

రాష్ట్ర ప్రభుత్వం బిల్లును అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కు పంపిన రోజే రాష్ట్ర బీజేపీ నేతలు ఆయన్ను కలిసి, మునిసిపల్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్ర ఎన్నికల సంఘం హక్కుల్లోకి రాష్ట్ర ప్రభుత్వం చొరబడుతోందని ఫిర్యాదు చేశారు. బిల్లును సభకు తిప్పి పంపాలని డిమాండ్ చేశారు. ఇదే అంశం ఆధారంగా గవర్నర్ అడ్డు వేయడం గమనార్హం. ప్రజాప్రతినిధులను తొలగించే అధికారాన్ని కలెక్టర్కు అప్పగించడాన్ని కూడా బీజేపీ నేతలు ప్రశ్నించారు. నాటిన మొక్కల్లో 85ు బతక్కపోతే వార్డు సభ్యుడితో పాటు ప్రత్యేకాధికారిపై చర్యలు, శాశ్వతంగా తొలగించడం వంటి నిబంధనలు కూడా సహేతుకంగా లేవని గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Image result for esl narasimhan

ఆర్డినెన్స్ తేవాలంటే మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఆమోదం పొందాల్సి ఉంటుంది. మంత్రివర్గ సమావేశం వెంటనే నిర్వహించే సమయం లేకపోవడంతో సర్క్యులేషన్ పద్థతిలో ఇందుకు సంబంధించిన ఫైలు మంత్రులకు పంపారు. వారి వారి ఇళ్ల వద్దనే సంతకాలు తీసుకున్నారు. ఆర్డినెన్స్ తేవడం కోసమే శనివారం రాత్రే అసెంబ్లీ సమావేశాలను ప్రోరోగ్ చేశారు. ఒకసారి అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుకు సవరణలు చేయాలంటే మళ్లీ సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తరువాతే గవర్నర్కు పంపాలి. అలా చేయాలంటే మరోసారి అసెంబ్లీ భేటీ జరగాలి. ఈ తతంగాన్ని నివారించడానికే ఆర్డినెన్స్ తెచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గవర్నర్ ఇలా బిల్లును తిప్పి పంపడం ఇదే తొలిసారి కాకపోయినప్పటికీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

Image result for esl narasimhan kcr

శాసనసభ ఎన్నికల తర్వాత కొద్ది నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతరం పెరిగిందన్న వార్తలు వినవస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ఆసక్తిని సంతరించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో యుద్ధమేనని బీజేపీ నేతలు పదేపదే ప్రకటిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ప్రభుత్వంతో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం బలం పుంజుకుంది.