వైసీపీకి వంగ‌వీటి గుడ్ బై ?

330

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో మ‌ళ్లీ సీట్ల చిచ్చు రేగింది, పార్టీ త‌ర‌పున వైసీపీకి కుడిభుజంగా ఉన్న ఓ నేత పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీకి వంగవీటి శ్రీనివాస ప్రసాద్ రాజీనామా చేశారు.. ఆయ‌న త్వ‌ర‌లో జ‌న‌సేన‌లో చేరుతారు అంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి..దీనికి ముఖ్య కార‌ణం విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో సీటును వంగవీటి రాధాకు కేటాయించ‌కుండా మ‌ల్లాది విష్ణుకు కేటాయించారు అంటూ ప్రచారం జ‌రుగుతుండ‌టంతో ఇప్పుడు ఈ వివాదం వ‌చ్చింది.

Image result for వంగవీటి శ్రీనివాస ప్రసాద్

ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ప‌ట్ట జ‌గ‌న్ పై తీవ్ర‌వ్య‌తిరేక‌త చూపుతున్నారు.. ఏ నాటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉంటే ఇటువంటి నిర్ణ‌యం తీసుకుంటున్నారా అని నిల‌దీస్తున్నారు.. దీనిపై రాధా రంగా మిత్ర మండ‌లి స‌మావేశం ఏర్పాటుచేసుకుంటోంది.. కాపుల‌ను ద‌గ్గ‌ర‌కు చేర్చుకున్నాము అంటున్న జ‌గ‌న్, ఈ విష‌యంలో ఏదో ఒక‌టి ఫైన‌ల్ గా చెప్పాలి అని అంటున్నారు. సారా కాంట్రాక్టర్లు, అవినీతి పరులకు వైసీపీలో సీట్లు కేటాయిస్తారా..? అని రంగా, రాధా మిత్రమండలి ఆగ్రహంతో ఊగిపోతోంది.

Related image

ఇక రంగా అభిమానులు దీనిపై ఫైర్ అవుతూ రాధా ఆఫీసు ద‌గ్గ‌ర వైసీపీ ఫ్లెక్సీలు తొల‌గించారు.. ఇదేం రాజ‌కీయం జ‌గ‌న్ అంటూ నినాదాలు చేస్తున్నారు, దీంతో కాపులు అందరూ ఒక్క దెబ్బ‌తో వెన‌క్కి వెళ్లిపోయారు అని అంటున్నారు నాయ‌కులు, ఇంత కాలం జ‌గ‌న్ దగ్గ‌ర ఉంటే ఇదేనా రంగా ఫ్యామిలీకి ఇచ్చే రెస్పెక్ట్ అని ప్ర‌శ్నిస్తున్నారు, మ‌రి దీనిపై న‌ష్ట‌నివార‌ణ వైసీపీ అధిష్టానం ఎలా చేస్తుందో చూడాలి.