Breaking News వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ న్యూస్ ఆనందంలో జ‌గ‌న్ కుటుంబం

476

ఉత్త‌రాంధ్ర ఈ సారి వైసీపీని ఆదుకుంటుందా..? అన్న ప్ర‌శ్న‌కు రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న వైసీపీకి గ‌ట్టి షాక్ ఇచ్చిన జిల్లాలుగా వీటిని భావిస్తారు. ఏకంగా వైఎస్ జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ ఓట‌మిపాలయ్యారు. దాంతో ఈ సారి ఎన్నిక‌ల్లో ఎలాగైనా మెజార్టీ సీట్లు గెల‌వాల‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్ర‌య‌త్నాలు ఈ సారి ఫ‌లించే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.ఉత్త‌రాంధ్ర‌లో మొత్తంగా 25 అసెంబ్లీ స్థానాల‌ను గెలుపొందిన టీడీపీ ఈ సారి వాటిని నిల‌బెట్టుకోవ‌డం క‌ష్టమేనని రాజ‌కీయ ఎన‌లిస్టులు చెబుతున్నారు. వైసీపీ గాలి ఈ సారి గ్రామీణ ప్రాంతాల్లో బ‌లంగా వీచింద‌ని, దాంతో టీడీపీ జాత‌కం తిర‌గ‌బడుతుంద‌ని, ఈ మూడు జిల్లాల్లో వైఎస్ జ‌గ‌న్ చేసిన పాద‌యాత్ర పార్టీకి మాంచి ఊపు ఇచ్చింద‌ని చెప్పాలి.

ఆరు నెల‌ల‌పాటు మూడు జిల్లాల్లో వైఎస్ జ‌గ‌న్ ప‌ట్టుద‌ల‌గా చేసిన పాద‌యాత్ర‌కు మంచి స్పంద‌నే ల‌భించింది. దాని ఫ‌లితాలే ఈ ఎన్నిక‌ల్లో క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు.శ్రీ‌కాకుళం జిల్లాలో ప‌లాన సీటు గెలుస్తామ‌ని టీడీపీ చెప్ప‌డానికి లేకుండా చేసిన ఘ‌న‌త వైసీపీదేన‌ని అంటున్నారు. ఈ జిల్లాలో ఇద్ద‌రు మంత్రుల సీట్లు డౌట్‌లో ప‌డ్డాయ‌ని ఈ జిల్లాలో వైసీపీ మొద‌ట‌గా గెలిచేసీటు పాత‌ప‌ట్నం నుంచి రెడ్డి శాంతినే అంటున్నారు. దాదాపు స‌గానికిపైగా సీట్ల‌ను వైసీపీ గెలుపొందుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Image result for jagan family

ఇక విజ‌య‌న‌గ‌రంలో కూడా వైసీపీ ఈ సారి బాగానే రాణించిందనే చెప్పాలి. ఇక్క‌డ ఉన్న 9 అసెంబ్లీ సీట్ల‌లో కనీసం 5 సీట్లు వైసీపీ క‌న్ఫామ్ అయిపోయిన‌ట్టేన‌ని, మ‌రో నాలుగు సీట్లలో ట‌ఫ్ ఫైట్ న‌డిచినా చివ‌ర‌కు అవి వైసీపీ ఖాతాలో ప‌డే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ చెబుతున్నారు.విశాఖ‌పట్నం జిల్లా విష‌యానికొస్తే, ఈ జిల్లాలోని ముగ్గురు మంత్రుల గెలుపు సందేహంగానే ఉంద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రాజ‌యం ఎరుగ‌ని మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుకు వైసీపీ త‌రుపున పోటీ చేసిన కేకే రాధా చుక్క‌లు చూపించారు. అలాగే నర్సీప‌ట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి అయ్య‌న్న పాత్రుడు కూడా గెలుపు కోసం ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. మొత్తం మీద విశాఖ జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ సీట్ల‌లో ఈ సారి ఎన్నిక‌ల్లో స‌గ‌మైనా గెలుస్తామ‌ని వైసీపీ ధీమా వ్య‌క్తం చేయ‌డం విశేషం.