గ‌ల్లా జ‌య‌దేవ్ కు జాక్ పాట్ అరుదైన అవ‌కాశం

458

దేశం అంతా అవిశ్వాస తీర్మానం కోసం చ‌ర్చ ఏ విధంగా జ‌రుగుందా అని చూస్తున్న వేళ రానే వ‌చ్చింది.. లోక్‌స‌భ‌లో టిడిపి అవిశ్వా‌స తీర్మా‌నం నోటీసుపై స్పీ‌క‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్, నేడు చ‌ర్చ‌ను చేప‌ట్ట‌నున్నారు.. ఈనేప‌ధ్యంలో ఎటువంటి రాజ‌కీయ ప‌రిస్దితులు జ‌రుగుతాయా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే గుంటూరు ఎంపీ గ‌ల్లాజ‌య‌దేవ్ గ‌త స‌మావేశాల‌లో మిస్ట‌ర్ మోడీ జీ అంటూ నిల‌దీసి, ఏపీకి సాయం చేయ‌లేద‌ని బీజేపీ మోసం చేసింద‌ని చెప్పి స‌భ‌లో ఆవేశ‌పూరింగా అర్ధవంత‌మైన స్పీచ్ఇచ్చారు.. దీంతో ఆయ‌న‌కు గుంటూరు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున స్వాగ‌తం ప‌లికి క‌టౌట్లు క‌ట్టారు.

Image result for galla jayadev

అయితే మ‌రోసారి గుంటూరు ఎంపి గల్లా జ‌య‌దేవ్‌కు రాజకీయ పరంగా చక్కటి గుర్తింపు పొందే మంచి అవకాశం లభించింది. టిడిపి అవిశ్వాసంపై లోక్ సభలో జరిగే చ‌ర్చ‌ను గల్లా జయదేవ్ ప్రారంభించనుండటమే ఆ అరుదైన అవకాశం. ఇందుకు గల్లా జయదేవ్ సరైన వ్యక్తిగా భావించి ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఆ నిర్ణ‌యం తీసుకున్నారట. ఆ త‌ర్వాత వ‌చ్చే అవ‌కాశాన్ని ఎంపీలు రామ్మో‌హ‌న్ నాయుడు, కేశినేని నాని కొన‌సాగించాల‌ని పార్టీ ఎంపిల‌కు చంద్రబాబు సూచించారట.

Image result for galla jayadev

బాహుబ‌లికి వ‌చ్చి‌న క‌లెక్ష‌న్ల క‌న్నా అమ‌రావతికి కేంద్రం ఇచ్చి‌న నిధులు త‌క్కు‌వ‌గా ఉన్నా‌య‌ని లోక్‌స‌భ‌లో గ‌ల్లా చేసిన వ్యాఖ్య కు మంచి స్పందన లభించింది. ఈ సారి ఆయ‌న ఎటువంటి స్పీచ్ ఇస్తారా అని ప్ర‌జ‌లు అంద‌రూ ఎదురుచూస్తున్నారు.