సీఎం జ‌గ‌న్ కు చిన్నారి లేక చ‌దివి క‌న్నీరు పెట్టుకున్న జ‌గ‌న్

114

ఇంకా వెలి అనేది చాలా గ్రామాల‌లో క‌నిపిస్తోంది వినిపిస్తోంది. ప‌లు కుటుంబాలు ఈ వెలి అనే వెకిలి నిర్ణ‌యాల‌కు బ‌లైపోతున్నారు. పుట్టిన గ్రామాల‌ను వ‌దిలి ప‌ట్ట‌ణాల‌కు వేరే గ్రామాల‌కు వ‌ల‌స వెళుతున్నారు. పెద్ద‌లు వేసిన శిక్ష‌ల‌కు చిన్నారులు కూడా ప‌సిమ‌న‌సు గాయ‌ప‌రుచుకుంటున్నారు, త‌మ‌కు వెలి అంటే ఏమిటో తెలియ‌ని వ‌య‌సులో త‌ల్లిదండ్రుల‌తో పాటు పుట్టిన గ్రామం విడిచి బాట‌సారులు అవుతున్నారు.

Image result for cm jagan

తమ కుటుంబంపై నెలల తరబడి కొనసాగుతున్న కులకట్టుబాటు ఆ చిన్నారి లేత మనస్సును గాయపరిచింది. ఊళ్లోనే కాదు, బళ్లో సైతం ఎవరూ మాట్లాడకుండా గ్రామపెద్దలు హుకుం జారీ చేయడంతో తల్లడిల్లిపోతోంది. మనస్సులో నిత్యం రేగుతున్న అలజడిని ఎవరికి చెప్పుకోవాలో, ఎక్కడ చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతోంది. చివరకు ధైర్యం చేసి తన మనస్సులో పెల్లుబుకుతున్న ఆవేదనను అక్షర రూపంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి పంపింది. వేటపాలెం మండలంలోని మత్స్యకార గ్రామమైన రామచంద్రాపురంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడికి, పెద్దలకు మధ్య కులకట్టుబాటు పంచాయితీ నేటికీ సద్దుమణగలేదు. కాపుల తీర్పు మేరకు పిల్లలను బడికి దూరంగా ఉంచిన గ్రామస్థులు అధికారుల జోక్యంతో తిరిగి పాఠశాలకు పంపుతున్నారు. ఎంపీటీసీ మాజీ సభ్యుడి మనుమడు, మనుమరాళ్లతో మాట్లాడకూడదని షరతు పెట్టారు. అదేసమయంలో అతని కుటుంబ సభ్యులతో ఎవ్వరూ మాట్లాడకూడదని కులపెద్దలు తీర్మానించారు. దాన్ని ధిక్కరించిన వారికి రూ.10వేల జరిమానా విధించాలని నిర్ణయించడాన్ని ఆ లేఖలో అతని మనుమరాలైన చిన్నారి ప్రస్తావించింది.

ఈ క్రింద వీడియో చూడండి

వేటపాలెం మండలం రామచంద్రాపురానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడికి, గ్రామ పెద్దలకు మధ్య నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతోంది. గ్రామ కాపులు మాజీ ఎంపీటీసీ కుటుంబాన్ని బహిష్కరించారు. వారితో ఎవరు మాట్లాడిన రూ. 10వేలు తప్పు (జరిమానా) చెల్లించాలని తీర్పు చెప్పారు. పాఠశాలలో చదువుకుంటున్న వారి పిల్లలతో కూడా ఎవ్వరూ మాట్లాడకూడదని తీర్మానించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రామచంద్రపురంనకు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు కోడూరి వెంకటేశ్వర్లుకు, గ్రామ పెద్దలకు ఊరిలోని ఓ భూమి విషయమై వివాదం మొదలైంది. సామాజిక అవసరాలకు ఉపయోగించాల్సిన భూమిని వెంకటేశ్వర్లు తనపేరుపై రాయించుకున్నాడన్నది గ్రామస్థులు ఆరోపణ. అయితే అది తన సొంతభూమి అని వెంకటేశ్వర్లు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 13న పెద్దలు, గ్రామస్థులు సమావేశమై ఆభూమిని, గ్రామాన్ని వదిలి వెళ్లాలని వెంకటేశ్వర్లుకు హుకుం జారీ చేశారు. దీంతో అతను గ్రామం విడిచి వెళ్లిపోయాడు. అనంతరం తనకు ప్రాణహాని ఉందని వేటపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో జూలై 17న పెద్దలు, గ్రామస్ధులు వెంకటేశ్వర్లు ఇంటికి తాళం వేశారు.

Image result for cm jagan

ఆ సందర్భంగా జరిగిన ఘర్షణలో వెంకటేశ్వర్లు భార్య మంగమ్మ గాయపడింది. చీరాల వైద్య శాలలో రెండ్రోజులు చికిత్స పొందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వెంకటేశ్వర్లు భార్యను తీసుకొని గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా మళ్లీ వివాదం జరిగింది. దీంతో వెంకటేశ్వర్లు జూలై 22న కుటుంబ సభ్యులతో కలిసి ఒంగోలు వెళ్లారు. అక్కడ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు పురుగు మందు తాగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. త‌ర్వాత‌ అధికారులు సంఘటనపై విచారణ చేపట్టారు. పోలీసుల రక్షణలో వెంకటేశ్వర్లు, చిన్న కుమారుడు, కుటుంబ సభ్యులను గ్రామానికి తీసుకువచ్చారు. అధికారులు పెద్దలతో మాట్లాడారు.

ముందస్తు జాగ్రత్తగా పోలీసులు రామ చంద్రాపురంలో పికెట్‌ ఏర్పాటు చేశారు. ఇద్దరు ఏఎస్సైలు, ఒక హెడ్‌కానిస్టేబుల్‌, ఒక హోంగార్డు, ఏడుగురు ఏపీఎస్‌పీ సిబ్బంది మొత్తం 11 మందిని వెంకటేశ్వర్లు కుటుంబానికి కాపలాగా ఉంచారు. ఇప్పటికీ పికెట్‌ కొనసాగుతోంది.

Image result for cm jagan

ఈనెల 4వతేదీన గ్రామ పెద్దలు ఒక తీర్మానం చేశారు. ఆమేరకు వెంకటేశ్వర్లు మనుమడు, ఇద్దరు మనుమరాళ్లను స్కూలుకు రానివ్వొద్దని పట్టుబట్టారు. అందుకు ఉపాధ్యా యులు ఒప్పుకోలేదు. దీంతో మిగిలిన పిల్లలం దరినీ ఇళ్లకు తీసుకొచ్చేయాలంటూ కుల పెద్దలు దండోరా వేయించారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకెళ్లారు. 60 మంది చదువుతున్న ఈ బడిలో ముగ్గురే మిగిలారు. ఉపాధ్యాయులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఉపాధ్యాయుల సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. గ్రామస్థులు, పెద్దలతో చర్చలు జరిపారు. రోజూ కొంతమంది విద్యార్థులు స్కూల్‌కు హాజరవుతున్నారు. మొత్తం రోల్‌ 68మంది కాగా శనివారం 50మంది హాజరయ్యారు. అయితే మాజీ ఎంపీటీసీ సభ్యుడు మనుమడు, మను మరాళ్లతో స్కూలులో మిగిలిన ఎవ్వరూ మాట్లాడకూడదని పెద్దలు హుకుం జారీ చేశారు. అయితే వెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు గ్రామస్ధులకు మద్దతు తెలపటం విశేషం. ఇదిలా ఉండగా గ్రామంలోని పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్న వెంకటేశ్వర్లు మనుమరాలు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసింది.

Image result for cm jagan

మా పొలంలో జమాయిల్‌ చెట్లు నరికేశారు. మోటార్లు పీకేశారు. వల, బోటులో ఉండే ఇంజన్‌ ఎత్తుకెళ్లారు. మమ్మల్ని చంపుతామంటున్నారు. దీనికంతటికీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, అతని అనుచరులే కారణం. మేం మొదటి నుంచి వైసీపీకి మద్దతుగా పనిచేశాం. ఇప్పుడూ అదే పార్టీలో ఉన్నాం. అయినా మేము టీడీపీ అని దుష్ప్రచారం చేస్తున్నారు. మాకు వ్యతిరేకంగా గ్రామస్థులను ప్రేరేపిస్తున్నారు. మంత్రి మోపిదేవి వెంకటరమణను కూడా కలసి మా ఇబ్బందులు చెప్పాం. ఆయన సానుకూలంగా స్పందించారు. మా అమ్మాయి సీఎం జగన్‌కు లేఖ రాసింది. ఆయన ఈ విషయమై దృష్టి సారించాలని కోరుతున్నాం అని తెలియ‌చేశారు, ఏమైనా వివాదాలు ఉంటే పెద్ద‌లు చూసుకోవాలి పిల్ల‌ల్ని స్కూలు మాన్పించ‌డం పిల్ల‌ల‌తో మాట్లాడ‌ద్దు అని అన‌డం చేస్తున్నారంటే అక్క‌డ ఎలాంటి క‌ట్టుబాట్లు ఉన్నాయో తెలుస్తోంది, వారిలో మార్పు రావాల‌ని సీఎం జ‌గ‌న్ దీనిపై క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరుకుందాం.