బ్లేడ్ గురించి స్పందించిన బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్

560

తెలంగాణాలో అసెంబ్లీ రద్దయిన రోజు మొదలైన తీవ్ర ఉత్కంఠ నేటితో ముగిసింది.! డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల.. ఫలితాలు ఈ రోజు వెల్లడయ్యాయి.ఈ ఓట్ల లెక్కింపు మొదలైన కాసేపట్లోనే ‘వార్ వన్ సైడ్’ ఉందని తేలిపోయింది. ‘కారు’ జోరు చూసి ప్రత్యర్థి పార్టీలు బేజారారవుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే టీఆర్ఎస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది.

Image result for bandla ganesh

అయితే ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ప్రొడ్యూసర్, నటుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ ఆ తర్వాత నుంచి ఇచ్చిన ప్రతీ ఇంటర్వ్యూలో ఈ ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ తమ పార్టీ గెలవకుంటే.. బ్లేడుతో తన గొంతు కోసుకుంటానని ఆయన సవాల్ కూడా చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో.. సోషల్‌మీడియాలో గణేష్‌ని తెగ ట్రోల్ చేస్తున్నారు. ‘‘టీఆర్‌ఎస్ గెలిచింది.. ఇప్పుడు బండ్ల గణేష్ గొంతు కోసుకుంటాడా..?’’ అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రశ్నలు ఎదురుకోలేకే.. గణేశ్ ఎవరికీ కనిపించకుండా పారిపోయాడంటూ.. విమర్శలు చేస్తున్నారు. ఇక బండ్ల గ‌ణేష్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్ప‌డు టీఆర్ఎస్ అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు సినిమాల నుంచి రాజకీయాల్లోకి వ‌చ్చి మూడునెల‌ల‌కే ఇంత ఫాలోయింగ్ ఎందుక బండ్ల‌కు వ‌చ్చింది అంటే ఇదే కార‌ణం అని అంటున్నారుకొంద‌రు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలపై బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజల తీర్పును తాను గౌరవిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం, ఓటమిని అంగీకరిస్తున్నాం, గెలిచిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభినందనలు. బండ్ల గణేష్ అని ఆయన పేర్కొన్నారు. ఇక బండ్ల గ‌ణేష్ ట్విట్ల‌ర్లో శుభాకాంక్ష‌లు చెప్ప‌డం కాదు మీరు చేసిన కామెంట్ల పై క్ష‌మాప‌ణ చెప్పాలి అని కూడా క్వ‌శ్చ‌న్ చేస్తున్నారు ఎవ‌రూ కూడా బ్లేడుతో కోసుకోమ‌ని చెప్ప‌డం లేదు కాని ఇలాంటి కామెంట్లు మ‌రోసారి చేయ‌కుండా ఉండాలని కోరుతున్నారునేత‌లు. ఇక రాజకీయ స‌న్యాసం తీసుకుంటాను అని కామెంట్లు చేసిన రేవంత్ రెడ్డి అలాగే బండ్ల గ‌ణేష్ పై అత్య‌ధిక కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి వీరిద్ద‌రూ ఈ విష‌యంలో ఎటువంటి స్పంద‌న స్పందిస్తారో చూడాలి. మ‌రి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.