మోడీ మనిషి కాదన్న గల్లా..మరి బాబు మాటేమిటి..?

382

ఈ రోజు పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్నా సంగతి తెలిసిందే..తెలుగు దేశం పార్టీ ఎంపి గల్లా జయదేవ్ ఈ చర్చను ప్రారంభించారు…ఈ చర్చలో భాగంగా గల్లా భరత్ అనే నేను సినిమాను ప్రస్తావించారు..

Image result for galla jayadev

ఆ సినిమాలో మాట తప్పినా రాజకీయ నాయకుడు మనిషి కాదని హీరో మహేష్ బాబు అనడాన్ని చెప్పుకొచ్చారు జయదేవ్..ప్రత్యెక హోదా విషయంలో మాట తప్పినా మోడీ మనిషి కాదని సంచలన వ్యాఖ్యలు చేసారు…మరి చంద్రబాబు మాటేమిటి..?

Image result for modi

ప్రసంగం ప్రారంభించేందుకు ముందు గల్లా సహచర ఎంపి కేశినేని నాని కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతఘ్నతలు తెలియజేసారు…అంటే ఒకరకంగా తనకి చర్చ ప్రారంభించే అవకాశం ఇవ్వలేదని లోలోపల రగిలిపోతున్న నాని ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారన్నమాట జయదేవ్. అంతా బాగానే ఉంది కానీ మాటతప్పిన వారిని మనిషి అనరంటూ జయదేవ్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా చంద్రబాబుకు కూడా తగులుతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో అప్పుడే రచ్చ షురూ అయింది.

Image result for chandra babu

కేంద్రంలో మోడీ మాట తప్పితే, రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయలేని చంద్రబాబు కూడా మనిషి కాదని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు…ఎలాగైనా గెలవాలనే ప్రయత్న్మలో అలవి కాని హామీలను గుప్పించి అధికారం లోకి వచ్చాకా ఆ హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు మనిషి కాదని, అతన్ని మాట మీద నిలబడే వ్యక్తీ మార్చే బాధ్యతా గలా జయదేవ్ తీసుకోవాలని నెటిజన్లు కామెడీ చేస్తున్నారు..హామీలన్నీ గాలికొదిలేసిన చంద్రబాబుని మనిషిగా గుర్తించాలా వద్దా? స్వయంగా బాబు మనిషి జయదేవ్ చెప్పిన ప్రకారమైతే అతడ్ని మనిషి అనలేం. అందుకేనేమో చంద్రబాబుని అంతా మనిషి అనకుండా మోసగాడని అంటారు.