మోడీని స‌మాధానం చెప్ప‌లేకుండా చేసిన ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్

441

ఏపీ విభ‌జ‌న‌లో కాంగ్రెస్ పార్టీదే పాపం కాద‌ని బీజేపీ కూడా పాపంలో బాగం ఉంద‌ని ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ విమ‌ర్శించారు…. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించిన ఎంపీ, ఏపీ సమస్యలపై మాట్లాడుతూ రెండు జాతీయ పార్టీలు కలిసి ఏపీకి అన్యాయం చేశాయని అన్నారు. హైద‌రాబాద్ పెట్టుబ‌డుల హబ్ గా గ‌తంలో ఉందని…తెలంగాణ నుంచి విడిపోయిన త‌ర్వాత ఏపీకి రెవెన్యూ లేకుండా పోయింది అని ఆయ‌న అన్నారు. విభజనతో 90 శాతం జాతీయ సంస్థలు తెలంగాణలోనే ఉండిపోయాయన్నారు… ఏపీ అభివృద్ధి రేటు 13 శాతం ఉన్నా తలసరి ఆదాయం బాగా త‌గ్గిపోయింది అని అన్నారు.

Image result for galla jayadev parliament speech

వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామని ఆనాడు రాజ్య‌స‌భ‌లో నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ ప్ర‌క‌టించార‌ని, కాని బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ విష‌యం విస్మ‌రించింది అని అన్నారు ఆయ‌న‌..కాంగ్రెస్‌ పార్టీ 2014లో తెలుగుతల్లిని నిలువునా చీల్చిందని, కాంగ్రెస్‌ తల్లిని చంపి బిడ్డను ఇచ్చిందని ఆనాడు మోదీ అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్ గుర్తుచేశారు….ఇక ఏపీకి ప‌రిశ్ర‌మ‌లు లేవు- ఏపీకి రెవెన్యూ లోటు ఉంది అని ఆయ‌న తెలియ‌చేశారు.

Image result for modi

ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని 2018లోఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పారన్నారు. ఆర్థిక సంఘం అభ్యంతరాలను సాకుగా చూపారని ఆనాడు ఇలా చేయ‌డం క‌రెక్టా అని ఆయ‌న విమర్శించారు..గ‌తంలో విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక హూదా ప‌ది సంవ‌త్స‌రాలు ఉండాలి అని బీజేపీ స‌పోర్ట్ గా మాట్లాడింది.. ఇప్పుడు ఏపీకి సాయం చేయ‌డంలో తిలోద‌ల‌కాలు వ‌దిలారు అని విమ‌ర్శించారు గ‌ల్లాజ‌య‌దేవ్ ..దీంతో దీనిపై బీజేపీ ఎటువంటి స‌మాధానం చెప్ప‌లేకుండా పోయింది అని ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కు కితాబిస్తున్నారు తెలుగు ప్ర‌జ‌లు.