కార్గిల్ యుద్దం, వాజ్ పేయి రాసిన ఈ లేఖలో ఏముంది? నమ్మలేని నిజాలు ఇవే

447

వాజ్ పెయ్ పేరు చెబితే ఇండియా పాకిస్తాన్ కార్గిల్ వారు గుర్తువ‌స్తుంది దేశంలో ఎటువంటి అల్ల‌ర్లు చోటు చేసుకోకుండా దేశాన్నికాంగ్రేసేత‌ల ప్ర‌ధానిగా మొట్ట‌మొద‌టిసారి ఐదుసంవ‌త్స‌రాలు ప్ర‌ధానిగా చేశారు.. ఆయ‌న ట్రాక్ రికార్డు చూస్తే ప‌దిసార్లు పార్ల‌మెంట్ కు వెళ్లి అతి కొద్ది మంది సాధించిన రికార్డును ఆయ‌న పేరిట న‌మోదు చేసుకున్నారు. ఆయ‌న కార్గిల్ యుద్ద స‌మ‌యంలో ఎంత ఒత్తిడి ఉన్నా ఎంతో తెలివిగా స‌మ‌య‌స్పూర్తితో ఆచితూచి అడుగులు వేశారు ఓసారి ఆనాటి విష‌యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

కార్గిల్‌ యుద్ధ సమయంలో మేం సరిహద్దు దాటి పాకిస్థాన్‌పై దాడి చేయాలని భావించాం. కానీ అప్పటి ప్రధాని వాజ్‌పేయి అందుకు అంగీకరించలేదు అని ఆనాటి ఆర్మీ చీఫ్‌ వి.పి.మాలిక్‌ రెండేళ్ల కిందట వెల్లడించారు. నియంత్రణ రేఖ దాటి పాక్‌పై దాడి చేయాల్సిందేనని తాను పట్టుబట్టగా, వాజ్‌పేయి ఒకేరోజులో 3 సార్లు తనతో సుదీర్ఘంగా సమావేశ మయ్యారని, ప్రస్తుతానికి గీత దాటవద్దంటూ తనను ఒప్పించారని మాలిక్‌ చెప్పారు. అంతర్జాతీయ ఒత్తిళ్లే వాజ్‌పేయి వైఖరికి కారణమై ఉండవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. అయితే వాజ్‌పేయి ఆనాడు నిజంగానే మెతగ్గా వ్యవహరించారా? అసలు ఆ పరిణామాల వెనుక ఏం జరిగింది? అనే విషయాలపై ప్రముఖ జర్నలిస్టు బర్ఖాదత్‌ లోతైన పరిశోధన చేశారు.

కార్గిల్‌ యుద్ధ సమయంలో వాజ్‌పేయి ఎంతో దూకుడుగా వ్యవహరించారని ఆమె తేల్చిచెప్పారు. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌కు వాజ్‌పేయి రాసిన ఓ లేఖ వివరాలను తన పుస్తకంలో ఆమె బయటపెట్టారు. కార్గిల్‌ పోరాటం ద్వారా పాకిస్థాన్‌ను పారదోలలేకపోతే మరో విధంగానైనా తరిమికొడతాం. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని వాజ్‌పేయి ఆ లేఖలో స్పష్టంచేశారు. అవసరమైతే అణ్వస్త్ర దాడికి కూడా భారత్‌ సిద్ధంగా ఉన్నట్లు అమెరికాకు సంకేతాలు పంపారు. దీంతో క్లింటన్‌ ఆనాటి అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ ఆంథోనీ జిన్నీని నాటి పాక్‌ ఆర్మీ చీఫ్‌ ముషారఫ్‌ వద్దకు పంపారు. ముషారఫ్‌ ఆయనతో కశ్మీరు అంశం గురించి మాట్లాడేందుకు ప్రయత్నించగా నేను కార్గిల్‌ గురించి మాట్లాడేందుకు వచ్చాను, కశ్మీరు గురించి కాదు. మీరు వెంటనే కార్గిల్‌ నుంచి వైదొలగకపోతే యుద్ధాన్ని, అణు విధ్వంసాన్ని చేజేతులా కొనితెచ్చుకున్నట్లే అవుతుంది అని జిన్నీ ఆయనను హెచ్చరించారు.

దీంతో పాక్‌ సేనలు కార్గిల్‌ నుంచి వైదొలగక తప్పలేదు. ఇప్పుడు వెనుదిరిగి చూసుకుంటే ఆనాడు వాజ్‌పేయి తీసుకున్న నిర్ణయమే సరైనదనిపిస్తోందని మాలిక్‌ కూడా వ్యాఖ్యానించడం విశేషం. మరోవైపు.. 2003 మార్చి 20న అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్‌ ఇరాక్‌పై యుద్ధం ప్రకటించారు. భారత్‌ సహా మిత్రులందర్నీ యుద్ధంలో పాలు పంచుకోవడానికి రమ్మని ఆహ్వానించారు. అప్పటి భారత ప్రధాని వాజ్‌పేయి రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. 20 వేల మంది బలగాలను పంపాలని బుష్‌ స్వయంగా విజ్ఞప్తి చేసినా తిరస్కరించారు. సార్వభౌమ దేశం ఇరాక్‌పై అమెరికా దాడిని ఖండిస్తూ ఏకంగా పార్లమెంటులో తీర్మానం చేశారు… అది ఆ నాటి వాజ్ పెయి ధీర‌త్వం.. చూశారుగా ఆ నాయ‌కుడి విధానం పై మీ అభిప్రాయాల‌ను తెలియ‌చేయండి.