పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణం..!

504

మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు పాకిస్తాన్ కు ప్రధాని అయ్యారు..ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ అతి పెద్ద పార్టీగా అవతరించింది..ఈ నేపధ్యంలో ఇమ్రాన్ ఖాన్ దాయాది పాకిస్తాన్ కు 22 వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం పూర్తి చేసారు…క్రికెటర్ నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన ఇమ్రాన్ ఖాన్ చరిత్ర సృష్టించారని చెప్పుకోవాలి..పాకిస్తాన్ లో పవర్ సెంటర్ గా రెండు కుటుంబాల నుంచి పోటీని ఎదుర్కొని విజయం సాదించడం సామాన్యమైన విషయం కాదు…దేశ అధ్యక్షుడు మమ్ నూన్ హుస్సేన్ ఇమ్రాన్ చేత ప్రమాణస్వీకారాన్ని చేయించారు…

ఎలాంటి ఆర్భాటం లేకుండా.. సింఫుల్ గా జరిగిన ఈ ప్రమాణస్వీకారోత్సవానికి మాజీ ఇండియన్ క్రికెటర్.. ఇమ్రాన్ స్నేహితుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు. మరికొందరు సన్నిహితులు మాత్రమే ఈ ప్రమాణస్వీకారానికి హాజరైనట్లుగా చెబుతున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ నేతృత్వంలోని ఆర్టీ మొత్తం 272 స్థానాల్లో పోటీ చేసి 116 స్థానాల్లో విజయం సాధించింది. మెజార్టీకి అవసరమైన 21 స్థానాల దూరంలో ఇమ్రాన్ పరుగు ఆగింది. అయితే.. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ కు 176 ఓట్లు రాగా.. షాబాజ్ షరీఫ్ కు 96 ఓట్లు వచ్చాయి. దీంతో.. ఇమ్రాన్ ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమమైంది.