జనసేన లోకి మాజీ మంత్రి..!

428

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి ఇతర పార్టీల నేతలు వచ్చి చేరుతుండడం ఆ పార్టీకి సుభ పరిణామం..తాజాగా మాజీ మంత్రి కాకినాడకు చెందిన పారిశ్రామిక వేత్త ముత్తా గోపాల కృష్ణ ఆ పార్టీలో చేరనున్నారని సమాచారం..హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో పవన్ తో భేటీ అయిన ముత్తా త్వరలో జనసేన పార్టీలో చేరనున్నట్టు వెల్లడించారు..

మరోవైపు ఈ నెల 14న జనసేన పార్టీ ఎన్నికల ముందస్తు ప్రణాళికను విడుదల చేసేందుకు సిద్దమవుతుంది. విద్యావ్యవస్థపై పార్టీ పాలసీ కమిటీ రూపొందించిన ముసాయిదాపై సుదీర్ఘంగా చర్చించిన రాజకీయ వ్యవహారాల కమిటీ… ఫిన్లాండ్ తరహాలో విద్యావిధానాలను ఆంధ్రప్రదేశ్ లో దశలవారీగా అమలు చేసే తీరుపై అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు జనసేన సంస్థాగత నిర్మాణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, అమరావతి ప్రాంతాలకు ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించారు.