వైసీపీలో జ‌గ‌న్ స‌మ‌క్షంలో చేరిన మాజీ మంత్రి కండిష‌న్ ఒప్పుకున్న జ‌గ‌న్

197

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది.. ఈ జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఇప్ప‌టికే పెద్ద సంఖ్య‌లో జ‌గ‌న్ కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం పడుతున్నారు.. ముఖ్యంగా వైసీపీకి గ‌త ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలో అతి త‌క్కువ సీట్లు వ‌చ్చాయి, కాని ఈసారి జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయం అని అంటున్నారు వైసీపీ శ్రేణులు.

ఇక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌లో ఇటు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న అసంతృప్తి నేత‌లు వైసీపీ వైపు చూస్తున్నారు.. వారు అంతా జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకుని పార్టీలో చేరుతున్నారు.. ఇక రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి, రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి అని, నాయ‌కుల చేరిక‌ల‌తో మ‌రింత స్ప‌ష్టం అవుతోంది.

రాష్ట్రం కోసం పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున్న పోరాటాలు, ప్రజల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన చూసి, పలువురు నేతలు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి మానుగుంట మ‌హిధ‌ర్‌రెడ్డి వైఎస్సార్పీపీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజక వర్గంలో ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కందుకూరు నియోజక వర్గం నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలతో తరలివచ్చిన మహిధర్‌ రెడ్డిని వైఎస్‌ జగన్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు… ఇక పార్టీలో ఆయ‌న చేరిక‌కు ముందే ఆయ‌న ఎంపీ విజ‌య‌సాయిరెడ్డితో చ‌ర్చించారు.. ఆ స‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు కందుకూరు టికెట్ ఇస్తే చేరుతాను అని అడిగారట, ఈకండిష‌న్ కు జ‌గ‌న్ కూడా ఒకే చెప్పార‌ని తెలుస్తోంది.

Image result for jagan

ఈ సందర్బంగా మహిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎవరైనా సరే వైఎస్‌ జగన్‌ను బలపరిచే పరిస్థితులున్నాయన్నారు. రాష్ట్రంలో మార్పును, జగన్‌ నాయకత్వాన్ని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. వైఎస్సార్‌ ఆశయాలను సంపూర్ణంగా నెరవేరుస్తానని జగన్‌ అంటున్నారని, ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితుడై వైఎస్సార్‌సీపీలో చేరినట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కాకుండా తన అభివృద్దినే చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ గడ్డు పరిస్థితిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి ప్ర‌కాశం జిల్లాలో మానుగుంట మ‌హిథ‌ర్ రెడ్డి చేరిక‌తో పార్టీకి మ‌రింత ప్ల‌స్ అవుతుంద‌ని అంటున్నారు జిల్లా నాయ‌కులు.