వైసిపి లోకి నేదురుమల్లి తనయుడు…బిజెపికి షాక్..!

480

వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చేస్తున్న పాదయాత్రకు విశేష స్పందన వస్తుండడంతో ఇతర పార్టీల నేతలు వైకాపాలోకి చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు..ఈ నేపధ్యంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డి తనయుడు రాంకుమార్ రెడ్డి పిఠాపురంలో పాదయాత్రలో ఉన్న జగన్ ను కలవడం ఏపీలో రాజకీయాల్లో సంచలనంగా మారింది…ప్రస్తుతం ఏపి బిజెపి స్టేట్ సెక్రటరీ గా ఉన్న రాంకుమార్ వసిపి అధినేతను కలవడం చర్చనీయాంశం అయింది… నెల్లూరు జిల్లా వెంకటగిరి అసెంబ్లీ టిక్కెట్ ఇస్తే వైసీపీలో చేరడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే వెంకటగిరి టికెట్ ను ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఆశిస్తున్నారు..అదింకా ఖరారు కాకపోవడంతో ఆయన వైసిపి లో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని తెలుస్తోంది.. ఆనం కూడా ఇదే స్థానాన్ని ఆశిస్తున్నప్పటికీ అవసరమైతే ఆయన్ను వేరే చోటికి మార్చి రాంకుమార్ రెడ్డిని వెంకటగిరి నుంచి పోటీ చేయించాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం.క ాగా గతంలో కాంగ్రెస్ లోనే ఉన్న రాంకుమార్ ను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడనే కారణంతో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో ఎలాగూ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో దిక్కు లేకపోవడంతో సీనియర్ బీజేపీ నాయకుడు – ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో చేరినా అప్పటి నుంచి పార్టీలో నిమ్మకు నీరెత్తిన విధంగానే ఉన్నారు. మొన్ననే ఆయన్ను బీజేపీ ఏపీ పార్టీకి సెక్రటరీగా నియమించింది. అది జరిగిన ఒక్క రోజులోనే రాంకుమార్ వైసీపీలో తాను చేరడం ఖాయమన్నట్లుగా క్లియర్ సంకేతాలిచ్చారు.