ఏపీ మాజీ స్పీక‌ర్ కోడెల ఆత్మ‌హ‌త్య

215

తెలుగుదేశం పార్టీకి దారుణమైన న్యూస్అనే చెప్పాలి, పార్టీలో నేడు విషాదం అలముకుంది…ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు మృతి చెందారు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఉరి వేసుకున్న ఆయనను వెంటనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికు తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1947 మే 2న కండ్లగుంటలో జన్మించిన కోడెల.. గుంటూరు ఏసీ కాలేజీలో పీయూసీ చేశారు. ఆ తరువాత గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసి.. కర్నూల్ మెడికల్ కాలేజీలో ఎంఎస్ పూర్తి చేశారు. ఇక ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరిన కోడెల.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనూ మంత్రిగా పనిచేశారు.

ఈ క్రింద వీడియో చూడండి

2014 నుంచి 19వరకు ఏపీ స్పీకర్‌గానూ పనిచేశారు. ఆయనకు భార్య శశికళ, కుమార్తె విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు శివ రామకృష్ణ, సత్యనారాయణలు ఉన్నారు. ఇటీవలే గుండెపోటుకు గురైన ఆయన గుంటూరులో తన కుమార్తెకు చెందిన ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే ఈ ఎన్నికల్లో ఓటమి తరువాత చుట్టుముట్టిన కేసులు, రాజకీయ వేధింపుల కారణంగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతూ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూశారు.

Image result for kodela siva prasad

అసెంబ్లీ ఫర్నీచర్ వివాదంలో పోలీసులు కోడెలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో కోడెల ట్యాక్స్ పేరిట నరసరావు పేట ప్రాంతంలో బలవంతంగా వసూళ్లు చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన కుమార్తె, కుమారుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తెలుగుదేశం నేత‌లు క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. పెద్ద ఎత్తున హ‌స్ప‌ట‌ల్ కు ఆయ‌న‌ను చూసేందుకు త‌ర‌లి వ‌స్తున్నారు తెలుగుదేశం నేత‌లు.