టీడీపీకి ఐదు ప్ర‌శ్న‌లు స‌మాధానాల కోసం వెయింటింగ్

416

దేశంలో అనేక ఆరోప‌ణ‌లు విన‌ప‌డిన స‌మ‌యంలో ఏపీ పేరు వినిపిస్తోంది.. ఇది సీఎం చంద్ర‌బాబు ఓప్పుకోవాల‌ని కాదు అంటే దీనికి స‌మాధానాలు చెప్పాలి అని అంటున్నారు ప్ర‌తిపక్ష‌ పార్టీల నాయ‌కులు..అవినీతి, బందుప్రీతి, చీకటి బజార్, కాల్మనీ, కల్తీరాజ్, గూండారాజ్ మొదలైన నేరాలు పెరిగిపోయాయి అని విమ‌ర్శిస్తున్నారు.. వైసీపీ బీజేపీ నాయ‌కులు.

Image result for kanna lakshmi narayana

సీఎం చంద్ర‌బాబు కు బ‌ద్ద శ‌త్రువుగా మరింత మారిపోతున్నారు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నాల‌క్ష్మీనారాయ‌ణ‌… ఆయ‌న సీఎం చంద్ర‌బాబుకు గ‌త కొద్ది రోజులుగా ప‌లు ప్ర‌శ్న‌లు సంధిస్తూనే ఉన్నారు.. ఇప్ప‌టికే ప‌ది ప్ర‌శ్న‌లు అడిగిన క‌న్నా మ‌రో మూడు ప్ర‌శ్న‌లు వేసి మ‌రింత టీడీపీకి హీట్ పుట్టిస్తున్నారు..

1. సంవత్సరానికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతుల నుండి తీసుకుని, వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా దారుణంగా వంచించి, స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో మెజారిటీ వాటా (58%) సింగపూర్ సంస్థలకు దోచిపెట్టడం లేదా? రాజధాని భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు సిద్దమా? దీనిపై తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం మంత్రులు నాయ‌కులు స‌మాధానం చెప్పాలి అని స‌వాల్ చేశారు.

Image result for chandra babu

2.. రాష్ట్రంలో 2014 ఎన్నిక‌ల త‌ర్వాత మీరు అధికారంలోకి వ‌చ్చారు ఆ స‌మ‌యంలో ల‌క్ష కోట్ల రూపాయ‌ల ఉన్న రుణం ఇప్పుడు రూ 2.35లక్షల కోట్లకు ఎందుకు పెరిగిందో ప్రజలకు సంజాయిషీ ఇవ్వగలరా? రాష్ట్రాన్ని ఇంత అప్పుల మ‌యం ఎలా చేశారు అని ప్ర‌శ్నించారు..

3. గోదావరి పుష్కరాలలో 29 మంది చనిపోవడానికి మీ ప్రచార పిచ్చి కారణం కాదా? మీ వనం-మనం కార్యక్రమానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఐ.పోలవరంలో అమాయాక విద్యార్ధులు చనిపోవడం నిజం కాదా? మీ ప్రచార పిచ్చితో రాష్ట్రంలో జరిగిన అమాయకుల ప్రాణాలు కోల్పోయారు దీనికి నైతిక బాధ్య‌త ఎవ‌రు వ‌హిస్తారు.

Image result for modi
4. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించింది ముందు ఎవ‌రు , అసెంబ్లీ లో కేంద్ర ప్రభుత్వానికి ధన్య వాద తీర్మానం చేయించింది మీరు కాదా మ‌రెవ‌రైనా వ‌చ్చి చేశారా… ముందే ఎందుకు ఒప్పుకున్నారు, ప్ర‌త్యేక హూదా కావాల‌ని అప్పుడు కోర‌చ్చు క‌దా… ప్యాకేజీలో భాగంగా నిధులు తీసుకుంటూనే, ప్రత్యేక హోదా కావాలనడం దుర్మార్గం కాదా..

5. పారదర్శక పాలన అందిస్తున్నాం అంటూ గొప్పలు చెప్పుకునే మీరు మీ స‌ర్కారు…అత్యధిక సంఖ్యలో రహస్య జీఓలను జారీ చేసిన విషయం నిజం కాదా? అసలు రహస్య జీఓలను విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చిందీ? ఇవన్నీ అవినీతి కోసం కాదా?

Image result for kanna lakshmi narayana

ఈ ఐదు ప్ర‌శ్న‌లు తెలుగుదేశానిక బీజేపీ సంధించిన ప్ర‌శ్న‌లు.. మ‌రి దీనిపై మీడియా ముందుకు వ‌చ్చి, గ‌ళం విప్పే నాయ‌కులు, తెలుగుదేశం నాయ‌కులు ఎవరూ కూడా ముందుకురావ‌డం లేదు.. దీనికి ఏ సైకిల్ పార్టీ నాయ‌కుడు స‌మాధానం చెప్ప‌డం లేదు.. మ‌రి చూడాలి ఎటువంటి స‌మాధానం దీనిపై వ‌స్తుందో.