పాద‌యాత్ర‌లో అపశృతి

262

ఏపీకి కేంద్రం అన్యాయం చేసింది అని ఇంత కుట్ర, కేంద్రం ప‌న్ని ఏపీని నాశ‌నం చేసింది అని కాంగ్రెస్ పార్టీ ఏపిని విభ‌జిస్తే బీజేపీ న‌మ్మించి మోసం చేసింది అనేది తెలుగుదేశం విమ‌ర్శ.. తెలుగుదేశం పార్టీ ఎంత దారుణ‌మైన రాజ‌కీయ ప‌రిస్దితుల‌ను కేంద్రం నుంచి ఎదుర్కుంటోందో తెలిసిందే.. కేంద్రం ఇబ్బందులు పెడుతున్నా ఏపీలో సీఎం పాల‌న భ‌య‌ప‌డకుండా కేంద్రానికి త‌ల వంచ‌కుండా చేస్తున్నారు అని అంటున్నారు తెలుగుదేశం నేత‌లు.


ఇక తాజాగా ఓ నేత పాద‌యాత్ర చేప‌ట్టారు, మ‌రి ఆ విష‌యం ఏమిటి అప‌శృతి ఏమిటి అనేది తెలుసుకుందాం…కేంద్రం ఏపీపై కుట్రచేస్తోందని ఆరోపిస్తూ సోమవారం రాజమండ్రిలో టీడీపీ చేపట్టిన పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది… పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్సీ అదిరెడ్డి అప్పారావు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వెంటనే ఆయనను టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపాయి. కేంద్రంలో ఉన్న బీజేపీకి మ‌రోసారి ప్ర‌జ‌లు ప‌ట్టంక‌ట్ట‌రు అని ఏపీలో ఆపార్టీ పాతాళానికి వెళ్లిన‌ట్టే అని అంటున్నారు ఇక్క‌డ టీడీపీ శ్రేణులు.