రాహుల్ గాంధీ చంద్రబాబు కలయిక వల్ల టీడీపీ కి ఎంత మంది రాజీనామా చేసారో తెలిస్తే షాక్

302

కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు నివురుగ‌ప్పిన నిప్పులా ఉండేవి.. ఇక ఈ రెండు పార్టీలు క‌వ‌డం పై ప్ర‌తీ ఒక్క‌రూ చ‌ర్చించుకుంటున్నారు.. దీనిపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొంద‌రు ఎంతో కాలంగా పార్టీల్లో ప‌నిచేస్తున్న వారు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని విపక్షాలు బీజేపీ, టీఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ తదితర పార్టీలు తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో పలువురు నేతలు కూడా జీర్ణించుకోవడం లేదని అంటున్నారు.

Image result for రాహుల్ గాంధీ చంద్రబాబు

ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కలయిక దెబ్బ ఏపీలో టీడీపీకి గట్టి షాకిచ్చింది. కీలక నేత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఆయ‌న గుడ్ బై చెప్పారు.ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడులు గురువారం భేటీ అయిన విషయం తెలిసిందే. ఇది దేశ రాజకీయాల్లో కీలక మలుపు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో అనూహ్య మలుపు. ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై పుట్టిన పార్టీ టీడీపీ. అలాంటి రెండు పార్టీలు కలవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related image

రాహుల్, చంద్రబాబులు గంటసేపు భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రం అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించిందని, ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే కలిశామని వారు చెప్పారు. దేశాన్ని ఎలా కాపాడుకోవాలన్న అంశంపైనే చర్చించామన్నారు. దేశాన్ని కాపాడదాం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దామనే నినాదంతో ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయన్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మొత్తానికి రాజకీయంగా ఈ భేటీ స‌రికొత్త సంచ‌ల‌నాల‌ను రేకెత్తించింది అనే చెప్పాలి. ఇటు పార్టీ త‌ర‌పున కొంద‌రు సీనియ‌ర్లు కూడా వ్య‌తిరేకించారు తాము ఈ పొత్తును స్వాగ‌తించ‌ము అని గ‌తంలో మంత్రులు కూడా అన్నారు.. కాని నేడు అవ‌న్నీ ప‌టాపంచ‌లు అయ్యాయి. మ‌రి నాయ‌కులు క‌లిశారు స‌రే కిందిస్ధాయిలో ఉన్న కేడ‌ర్ క‌లిసి వెళుతుందా? ఇది మాత్రం డౌట్ అంటున్నారు ప్ర‌జ‌లు. మ‌రి చూశారుగా ఈ అల‌యెన్స్ పై మీ అభిప్రాయం తెలియచేయండి. ఇలా కాంగ్రెస్ బీజేపీ క‌ల‌వ‌డం పై మీరు ఏమ‌నుకుంటున్నారు ఇద్ద‌రూ క‌లిసి ప‌నిచేస్తారు అని మీరు భావిస్తున్నారా కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.