తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ విడుదల.. ఫలితాలు చూసి షాకైన నాయకులు

394

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. శుక్రవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు వరకు జరిగింది. ఓటు వేయడానికి జనాలు అన్ని నియోజకవర్గాల్లోనూ పోలింగ్‌‌ బూత్‌లకు బారులు తీరారు. అయితే కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి ఘటనలు తప్ప మిగిలిన అన్ని చోట్లా ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. ఇక పోలింగ్ అవ్వ‌గానే అందరూ ఎదురు చూసేది ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు. మ‌రి ఎగ్జిట్ పోల్స్ స‌ర్వే ఫ‌లితాలు తెలంగాణ‌లో ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్
టౌమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల చేసింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్ర‌కారం ఇక్క‌డ టీఆర్ఎస్ 66 కాంగ్రెస్ 37 బీజేపీ 7 ఎంఐఎం 7 స్ధానాలు గెలుచుకుంటుంది అని ఇత‌రులు రెండు స్ధానాలు గెలిచే అవ‌కాశం ఉంది అని తేల్చింది.. గ‌త ఎన్నిక‌ల్లో 63 సీట్లు గెలుచుకుంది టీఆర్ ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్స్ 66 సీట్లు గెలుస్తుంది అని స్ప‌ష్ట‌మైన ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంది అని టౌమ్స్ నౌ చెబుతోంది. అయితే 100 సీట్లు గెలుస్తాం అని కేసీఆర్ చెప్పారు. కాని కూట‌మిలో అన్ని పార్టీలు క‌లిపి రావ‌డంతో ఇప్పుడు తెలంగాణ‌లో ఈ ఎఫెక్ట్ ప‌డింది అని టౌమ్స్ నౌ చెబుతోంది. కాని తెలంగాణ‌లో క‌చ్చితంగా టీఆర్ఎస్ దే మ‌రోసారి అధికారం అని తేల్చింది టౌమ్స్ నౌ.

Image result for తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్
ఇక రిప‌బ్లిక్ ఛాన‌ల్ ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల చేసింది.. టీఆర్ఎస్ 50 నుంచి 65స్ధానాలు గెలుస్తుంది.. కూట‌మి 38 నుంచి 52 స్ధానాలు గెలుస్తుంది అలాగే బీజేపీ నాలుగు నుంచి ఏడు స్ధానాలు గెలుస్తుంది అని ఇక ఇతరులు 10 నుంచి 17 స్ధానాలు గెలిచే అవ‌కాశం ఉంది అని ఎగ్జిట్ పోల్స్ తెలియచేశాయి.

సీఎన్ ఎన్ ఎగ్జిట్ పోల్స్ చూస్తే

టీఆర్ఎస్ 50-65 సీట్లు
కాంగ్రెస్ 38-52 సీట్లు
క‌మ‌లం పార్టీ బీజేపీ 4-7 సీట్లు
10 నుంచి 17 ఇత‌రులు గెలిచే ఆస్కారం ఉంది అని తెలియచేసింది.

ఇక తెలంగాణకు చెందిన స‌ర్వే సంస్ధ ఆరా త‌న స‌ర్వే ఫ‌లితాలు తెలియ‌చేసింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

 

టీఆర్ఎస్ 75 నుంచి 85 సీట్లు
కాంగ్రెస్ 25 నుంచి 35సీట్లు
క‌మ‌లం పార్టీ బీజేపీ 2నుంచి 3సీట్లు
ఎంఐఎం 7నుంచి 8 సీట్లు
ఇత‌రులు మూడు సీట్లు గెలుచుకుంటారు అని ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించింది. మ‌రి చూశారుగా ఈ పోల్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలిచేయండి.