జ‌న‌సేన‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీ

354

తెలుగుదేశం వైసీపీకి పోటీగా ఇప్పుడు జ‌న‌సేన రెడీ అవుతోంది..ఏపీలో వైసీపీ తెలుగుదేశంలో చేరిక‌లు ఎలా ఉన్నాయో, అలాగే జ‌న‌సేన‌లో కూడా చేరిక‌లు జ‌రుగుతున్నాయి.. తాజాగా మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మ‌క్షంలో జ‌న‌సేన‌లో చేరారు.. ఆయ‌న రాక‌పై ఇప్ప‌టికే అనేక వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇక చివ‌ర‌కు అదే ఫైన‌ల్ అయింది.. తెలుగుద‌శం వైసీపీ పార్టీకి పోటీగా జ‌న‌సేన ప‌రుగులు పెడుతోంది అనేది తాజాగా పార్టీల్లో చేరిక‌ల‌తో తెలిసిపోతోంది.

Related image
తూర్పుగోదావ‌రి జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గానికి చెందిన వివిధస్థాయి నాయకులు జనసేనలో చేరారు కందుల దుర్గేష్. కాంగ్రెస్‌ విద్యార్థిసంఘం నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయ‌న పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించడంతో ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ లో ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేకంగా ఓ స్ధానం సంపాదించుకున్నారు….జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేస్తూ, పార్టీకి జీవం పోసి, తర్వాత వైసీపీలో చేరారు. అక్కడ పరిస్థితులు నచ్చక ఇటీవలే రాజీనామా చేసి స్ద‌బ్దుగా ఉన్నారు.
Image result for janasena
ఈ నేపథ్యంలో తన అనుచరులతో కలసి జనసేనలో ఆయ‌న చేరారు… ఆయ‌న మాట్లాడుతూ పవన్‌ నాయకత్వంలో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయని, రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని నడపగల సత్తా ఆయనకుందని తెలిపారు. జనసేన ఏర్పడినప్పటి నుంచి పవన్‌ కల్యాణ్‌ నడకను, నడతను తాను పరిశీలిస్తున్నానని, ఆయన ఆలోచనలతో పాటు సమస్యను అధ్యయనం చేసే నాయకుడని ఆయ‌న కొనియాడారారు.ఇక ప‌వ‌న్ వెంట న‌డిచే నాయ‌కులు సినిమా వారు అని అనుకున్నారు, కాని ఇప్పుడు చూస్తుంటే మాజీలు సీనియ‌ర్లు జూనియ‌ర్లు రాజ‌కీయ నేత‌లు అంద‌రూ జన‌సేన‌లో చేర‌డంతో ఇప్పుడు ఇదే అంశం పొటిలిక‌ట్ కారిడార్లో చ‌ర్చ‌కు దారి తీసింది.