స‌స్పెన్స్ క్రియేట్ చేస్తున్న ల‌క్ష్మీనారాయ‌ణ

322

ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు అవి తీర్చ‌డానికి ఏ నేత అయినా ప్ర‌జాసేవ‌లోకి వ‌స్తారు.. అదే విష‌యాన్ని మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ తెలియ‌చేశారు. ఆయ‌న ఇప్ప‌టికే రాజ‌కీయంగా ఏపార్టీలో చేరుతారా అంటూ ప్ర‌జ‌ల‌తో పాటు ఇటు రాజ‌కీయ నాయ‌కులు కూడా ఎదురుచూస్తున్నారు. ఏపీలో ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ ప్ర‌చారాలు చేస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న కొత్త పార్టీ పెడ‌తారు అంటూ వార్త‌లు వినిపించాయి. చివ‌ర‌కు ఆయ‌న రెండు నెల‌లుగా ఇలా ప్రజా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇక ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూనే ముఖ్యంగా రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు.

Image result for jd lakshmi narayana

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు త‌న వ‌ల్ల ప‌రిష్కారం దొరుకుతుంది అని అనుకుంటే క‌చ్చితంగా తాను రాజ‌కీయాల్లోకి వస్తాను అని తెలియ‌చేశారు. ఇక ప్ర‌జాక్షేత్రంలోకి ఆయ‌న ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు అని ప్ర‌జ‌లు కూడా వెయిట్ చేస్తున్నారు. కాని ఆయ‌న ఊరిస్తూ ఎటువంటి స‌మాధానం చెప్ప‌కుండా దాట‌వేస్తున్నారు.మద్యం, కులం, డబ్బు రాజకీయాలు పారద్రోలేలా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విభజన హామీల అమలు కోసం పోరాడతామని ఆయన తెలిపారు.

Image result for jd lakshmi narayana

వ్యవసాయ, చేనేత కార్మికుల కోసం మేనిఫెస్టో రూపొందిస్తామని చెప్పారు. కౌలు రైతులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.మొత్తానికి మ‌రో రెండు నుంచి మూడు నెలల్లో పొలిటిక‌ల్ హీట్ ఏపీలో క‌నిపిస్తుంది ఈ స‌మ‌యంలో ఆయ‌న ఇప్పటికే ఉన్న పార్టీలో చేరుతారా లేదా కొత్త పార్టీల పెడ‌తారా అనేది తేలిపోతుంది అంటున్నారు రాజకీయ మేధావులు.