ల‌గ‌డ‌పాటికి చిక్కులు కేసు న‌మోదు

283

తెలంగాణ‌లో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఓ సంచ‌ల‌నం క్రియేట్ చేశారు అనే చెప్పాలి.. తెలంగాణ ఎన్నిక‌ల్లో స్వ‌తంత్రులు ప‌ది మంది గెలుస్తారు అని బాంబ్ పేల్చారు.. దీనిపై పెద్ద చ‌ర్చ జ‌రిగింది. దీంతో మాజీ ఎంపీ లగడపాటిపై టీఆర్‌ఎస్‌ శుక్రవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.. వారంలో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేసేలా ఈ ప్రకటన ఉన్నదని, సర్వే వివరాలు ప్రకటించటం ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనిపై మిగిలిన పార్టీలు కూడా ఆగ్ర‌హంగా ఉన్నాయి. ఇలా ఇద్ద‌రి పేర్లు బ‌య‌ట‌కు చెప్ప‌డం విరుద్దం అని అంటున్నారు.

Image result for ల‌గ‌డ‌పాటికి

టీఆర్‌ఎస్‌ ఎన్నికల సమన్వయ కమిటీ తరఫున దండె విఠల్‌ ఫిర్యాదుచేశారు. తిరుపతిలో లగడపాటి చేసిన ప్రకటనను టీవీల్లో ప్రసారం చేశారని.. ఇలాంటి ప్రకటన ఈ సమయంలో సరైంది కాదని పేర్కొన్నారు. రోజుకు ఇద్దరు ఇండిపెండెంట్లకు సంబంధించిన ఫలితాలను వెల్లడిస్తానని లగడపాటి పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. అయితే మ‌రి దీనిపై ల‌గ‌డ‌పాటి ఎలా స్పందిస్తారో చూడాలి.