ఏపీలో ఎన్నిక‌ల టైమ్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ప్లాన్ లీక్ షాక్ లో ఎమ్మెల్యేలు

314

ఎత్తులకు పై ఎత్తులు రాజకీయాలలో జిమ్మిక్కులు ఎన్నికల వేళ అనేక వార్తలు వినిపిస్తాయి..కొద్ది నెల‌ల క్రితం తెలంగాణ ఎన్నికలు పూర్తి అయ్యాయి, ఇప్పుడు మళ్లీ ఏపీలో ఎన్నికల సమయం స్టార్ట్ అయింది. మరి సర్వేలకు ఇదే మంచి కాలంగా చెబుతారు.. అయితే ఏపీలో తెలంగాణలో సర్వేలు అంటే వినిపించే పేరు కేవలం వన్ అండ్ ఓన్లీ లగడపాటి రాజగోపాల్. మరి అలాంటి ఈ సీనియర్ మాజీ ఎంపీ, ఇప్పుడు సైలెంట్ గా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కేవలం ఎన్నికల సమయంలో రాజ‌కీయ పార్టీల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఎన్నికల వేళ ఎవరు గెలుస్తారు ఇలాంటి సర్వేలు చేస్తున్నారు. గత తెలంగాణ ఎన్నికల్లో కనివీని ఎరుగని రీతిలో ఆయన ఎన్నికల సర్వే ఫలితాలు తారుమారు అయ్యాయి.

Image result for lagadipati

ఇక తెలంగాణ సమాజం, లగడపాటి సర్వేని నమ్మరు అనేది తేలిపోయింది. ఇక ల‌గ‌డ‌పాటికి ఎంతో హైప్ ఇచ్చిన మీడియా కూడా ఇలా సర్వే తేలిపోయే సరికి ఏమీ సమాధానం చెప్పలేకపోయారు.. అయితే ఇప్పుడు పలుసార్లు చంద్రబాబుని తెలుగుదేశం నేతలను ఆయన కలవడం చూస్తుంటే, ఆయన ఎటువంటి రాజకీయ ప్లాన్ వేస్తున్నారు అని అందరూ చర్చించుకుంటున్నారు..అయితే లగడపాటి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. మరి ఈ సమయంలో ఆయన రీ ఎంట్రీ ఇస్తారు అని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు లగడపాటికి మరోసారి ఎంపీ టికెట్ ఇవ్వడానికి బాబు అలాగే జగన్ కూడా గతంలో మంతనాలు జరిపారు అని వార్తలు వినిపించాయి.

ఈ క్రింది వీడియో చూడండి 

కాని ఇవి చర్చల్లోనే ఫెయిల్ అని అనుకున్నారు. సో ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో చేరి విజయవాడ లేదా గుంటూరు నరసరావు పేట నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అని మరో వార్త.. సో ఇది కూడా ఫేక్ అని ఇంకో వార్త వినిపిస్తోంది. కాని ఇటీవల ఆయన తెలుగుదేశం నేతలను బాబుని కలిసి ఈ సర్వేల గురించి తెలియచేశారు అని తెలుస్తోంది. ఏ ఎమ్మెల్యే పరిస్దితి ఎలా ఉంది అనేది సర్వే రిపోర్టులు బాబుకి అందిస్తున్నారట. అలాగే ఎమ్మెల్యేలు కూడా పర్సనల్ గా లగడపాటి చేత సర్వే చేయించుకుంటున్నారు అని కూడా అంటున్నారు .మొత్తానికి ఏపీలో అయినా తన సర్వే నిజం అవ్వాలి అనే ఉద్దేశంలో, లగడపాటి సర్వే పనిలో బిజీగా ఉన్నారు అని ఫైనల్ గా విజయవాడ కేంద్రంగా జరుగుతున్న చర్చ. మ‌రి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ల రూపంలో తెలియ‌చేయండి. ఏపీలో ల‌గ‌డ‌పాటి స‌ర్వే నిజం అవ్వ‌బోతోంది అని అనుకుంటున్నారా.