జనసేన పార్టీకి కోలుకోలేని షాకిచ్చిన ఎలక్షన్ కమీషన్

460

జనసేన పార్టీకి ఎన్నిక‌ల సంఘం గుర్తును కేటాయించింది.. ఎప్ప‌టి నుంచో గుర్తుకై ఎదురుచూస్తున్న జ‌న‌సేనానికి ఈరోజు ఇది తీపిక‌బురు అనేచెప్పాలి, మొత్తం దేశంలో 29 రాజ‌కీయ పార్టీల‌కు కొత్త‌గా ఎన్నిక‌ల సంఘం ఈ గుర్తులు కేటాయించింది. జ‌న‌సేన‌కు ఇదే ఉమ్మ‌డి గుర్తుగా కేటాయించింది ఈసీ, ఇక ఈ విష‌యాన్ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు అభిమానుల‌కు తెలియ‌చేశారు. శ‌నివారం రాత్రి ఈ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది ఈసీ, గ‌తంలో పార్టీ కార్య‌క్ర‌మంలో నిడ‌ద‌వోలులో, ఆగ‌స్టు12 న జ‌రిగిన ఓ స‌భ‌లో, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పిడికిలి గుర్తును ప్ర‌క‌టించారు.. ఇక కొత్త‌గా రాజ‌కీయ పార్టీ ఏర్పాటు చేసిన ప‌వ‌న్ కు, 2014లోనే ఎన్నిక‌ల సంఘం జ‌న‌సేన‌ను రాజ‌కీయ పార్టీగా గుర్తించింది.

View image on Twitter

తమ పార్టీ గుర్తు ‘గాజు గ్లాసు’ అంటూ జనసేన ట్విట్టర్‌లో ప్రకటించిన ప‌వన్ క‌ల్యాణ్ ప‌లు కీల‌క విష‌యాలు కూడా తెలియ‌చేశారు. 2019లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలు, తెలంగాణలోని 17 స్థానాల్లో గ్లాసు గుర్తు ద్వారానే ప్రజల ముందుకు వెళ్తున్నట్లు ఆ పార్టీ పేర్కొంది.జనసేన పార్టీని 2014 మార్చి 14న సినీ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతుగా జనసేనాని ప్రచారం నిర్వహించారు. అయితే తెలంగాణలో ఈ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి విధానాన్ని అవలంభించలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ కానీ, ప్రచారం కానీ నిర్వహించకుండా స్థిరత్వాన్ని కనబరిచింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఐతే.. ఈ ఎన్నికల గుర్తుపై కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది. ఇది ప్రజలను అంతగా ఆకట్టుకునే గుర్తు కాదని వారు భావిస్తున్నారు. ఎన్నికల సభల్లో చెప్పుకునేందుకు.. ఇది అంత అనువుగా ఉండదన్నది వారి అభిప్రాయం. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌లకు ఉన్న గుర్తులతో పోలిస్తే గాజు గ్లాసు అంతగా ఆకట్టుకునే పరిస్థితి లేదు. గాజు గ్లాసుతో పెద్దగా ఉపయోగాలు కానీ.. పోలికలు కానీ చెప్పే అవకాశం లేదు. అంతే కాకుండా.. ప్రత్యర్థులు సులభంగా ఈ గుర్తును సులభంగా విమర్శించే ఛాన్సుంది.గాజు గ్లాసు సున్నితంగా ఉంటుంది. సులభంగా పగిలిపోతుంది. అందులోనూ నిత్యావసర వస్తువు కాదు.. ఇలా ఇన్ని మైనస్‌లు ఉన్న గుర్తు వచ్చిందేమిటా అని జనసేన శ్రేణులు తలపట్టుకుంటున్నాయి. ఐతే.. జనం తలచుకుంటే ఎన్నికల గుర్తు ఏదైనా ఓట్లు గుద్దేస్తారని మరికొందరు ఆశావాదులైన కార్యకర్తలు నమ్మకంగా ఉన్నారు. ప‌వ‌న్ చ‌రిష్మా ముందు ఏ గుర్తు ఉన్న ఓట్లు ప‌డ‌తాయి అంటున్నారు. మ‌రి ఈ గుర్తుపై మీ అభిప్రాయం కూడా కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.