2019 ఏపీలో ఎన్నికల తేదీన ప్రకటించిన ఎన్నికల సంఘం షాక్ లో బాబు

577

కొన్ని రోజుల కిందటే ఐదు రాష్టాల ఎన్నికలు ముగిసిన సంగతి మన అందరికి తెలిసిందే. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వేయగా కేంద్రంలో ఉన్న బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెరాస mnf వంటి పార్టీలు అధికారం దక్కించుకుని కాంగ్రెస్ బిజెపిలకు షాక్ ఇచ్చింది. ఈ రెండు పార్టీలు లోకల్ పవర్ ఏంటో చూపించాయి. ఇక మిగిలిన రాష్టాలు కూడా ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు ప్రజలు ఏపీలో ఎప్పుడు జరుగుతాయా అని చూస్తున్నారు.మరి ఆ విషయం గురించి తెలుసుకుందామా.

Related image

2019 ఎన్నికలకు ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టింది. ఇటీవలే ఎన్నికల సంఘం అధ్యక్షులుగా సునీల్ అరోరా నియమితురయ్యారు. అరోరా ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ గురించి మాట్లాడనున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ లో ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సి ఉండడంతో ఎన్నికల షెడ్యూల్ ను ఫైనల్ చేసేందుకు మరికొంత సమయం పడుతుందని భావిస్తున్నారు. అయితే ఫిబ్రవరి చివర్లో లేదా మర్చి మొదట్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఏప్రిల్ చివర్లో లేదా మే మొదట్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ సమయంలో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఎన్నికల తేదీని ప్రకటిస్తారు.

2014 లో పార్లమెంట్ ఎన్నికలు 9 విడతలుగా విడుదల చేశారు. ఈసారి కూడా ఎన్నికల సిబ్బంది లభ్యత అలాగే ఈవీఎంల అందుబాటు వంటి అంశాలను తీసుకుని అనేక విడతలుగా ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారంలో మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. అప్పటివరకు పరీక్షలు పూర్తీ చెయ్యాలని ఆయా రాష్టాల ప్రభుత్వాలను ఆదేశిస్తుంది ఎన్నికల సంఘం. ఇక ఏపీతో పాటు మరికొన్ని రాష్టాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికలకు తెరదించడంతో ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల మీద అందరి దృష్టి పడింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా లోక్ సభ ఎన్నికల సమయంలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఎప్పుడు విడుదల చేస్తారో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.వచ్చే లోక్ సభ ఎన్నికల గురించి అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.