జ‌న‌సేనకు ఈ నాలుగు సెగ్మెంట్లు ప‌ట్టుకొమ్మ‌లా

380

జ‌న‌సేన పార్టీ త‌ర‌పున ప్ర‌భావం చూపిస్తుందా… యావ‌రేజ్ ర్యాంకులో ఉన్న నాయ‌కులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు దొర‌క‌క‌పోతే తెలుగుదేశం నుంచి జెండా మార్చి జ‌న‌సేన‌లో చేరాలి అని భావిస్తున్నారా? అందుకే వ‌చ్చేఎన్నిక‌ల్లో ఈ మాజీలు ఇప్పుడు ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా కాపు సెగ్మెంట్లో బ‌లంగా ఉన్న నాయ‌కులు కూడా పార్టీ మారి కాపు ఓటు బ్యాంకు ప‌వ‌న్ అభిమాన గ‌ణాన్ని త‌మ‌కు అనుగుణంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు.. అందుకు అగ్ర‌తాంబూలం కూడా రెడీ అయింది అని తెలుస్తోంది.. కాపులు అధికంగా ఉండే జిల్లాలు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలు.

Image may contain: 6 people, crowd and outdoor

ఇక్క‌డ తూర్పుగోదావ‌రి జిల్లాలో నాలుగు సెగ్మెంట్ల‌పై జ‌న‌సేన ప్ర‌భావం అధికంగా ఉంటుంది అని అంటున్నారు.. మ‌రి ఆ ప్ర‌భావం చూపించే సెగ్మెంట్లు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం… కొత్తపేట, రాజమహేంద్రవరం, పిఠాపురం, తుని ఈ నాలుగు సెగ్మెంట్ల‌లో జ‌న‌సేన స‌రైన అభ్య‌ర్దుల‌ను పోటీకి నిలుపుతుంది అని అంటున్నారు.. ఇటు తెలుగుదేశం వైసీపీ ఏ పార్టీ ఎదురు నిల‌బ‌డినా, ఆ పార్టీని ఢీకొట్టే స‌త్తా ఇక్క‌డ పార్టీ త‌ర‌పున ఎవ‌రు నిల‌బ‌డినా ఉంటుంది అని అంటున్నారు.. అయితే ఇక్క‌డ దీనికి రీజ‌న్ కూడా ఉంది..బ‌ల‌మైన అభ్య‌ర్దితో పాటు ఇక్క‌డ కాపు ఓటు బ్యాంకు బ‌లంగా ఉంది.. ఇది జ‌న‌సేన‌కు మ‌రింత ఊతం ఇచ్చే అంశం.

Image may contain: one or more people, crowd and outdoor

అందుకే ఈ నాలుగు సెగ్మెంట్ల‌లో జ‌న‌సేన ఇప్ప‌టి నుంచే నాయ‌కుల కోసం అన్వేష‌న చేస్తోంది.. ఇక్క‌డ ముక్కోణ‌పు పోరు ఉంటుందా లేదా వార్ వ‌న్ సైడ్ జ‌రుగుతుందా అని చ‌ర్చ జ‌రుగుతుంది…జిల్లా రాజకీయాలలో 2009 ఎన్నికల పరిస్థితి కొన్ని చోట్ల పునరావృత్తమయ్యేలా కన్పిస్తోంది అనేది తెలుస్తోంది…2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, టీడీపీ, ప్రజారాజ్యం పార్టీల మధ్య త్రిముఖ పోరు సాగింది.. ఆ ఎన్నికలలో పిఠాపురం, పెద్దాపురం, కొత్తపేట, కాకినాడ రూరల్‌లలో పీఆర్పీ అభ్యర్థులు గెలుపొందారు. ప్రత్తిపాడు, రాజానగరం, మండపేట, రాజమహేంద్రవరం రూరల్‌లలో టీడీపీ గెలుపొందింది.. మ‌రి ఇప్పుడు జ‌న‌సేన కూడా కొత్త ఆలోచ‌న‌లు చేస్తుందా లేదా ఏమి చేస్తుంది అనేది చూడాలి.